GHMC Rains (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC Rains: రెండు రోజుల పాటు వర్ష సూచన.. పూడికతీతలో విఫలమైన జీహెచ్ఎంసీ!

GHMC Rains: ఉక్కపోత, వడగాలులతో అల్లాడిన హైదరాబాద్ మహానగరంలో బుధవారం కురిసిన చిరు జల్లులతో కూల్ అయింది. సిటీలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చిరు జల్లులు కురవటంతో సిటీ చిల్ అయింది. ఎండ వేడిమి, ఉక్కపోత కొంత తగ్గటంతో మహా నగరవాసులు ఉపశమనం పొందారు. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న సమయంలో యువత వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భాగ్యనగరానికి వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షసూచన చేసింది.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు సూచించటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ముఖ్యంగా ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నందున, భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా రెండు రోజుల వర్ష సూచన రావటంతో జీహెచ్ఎంసీ కూడా కాస్త ముందుగానే వర్షాకాల సహాయక చర్యలకు సిద్దమైంది.

వర్షాకాల సహాయం, చెట్లు విరిగిపడటం, కరెంటు వైర్లు, తెగిపడటంతో పాటు భారీగా వాటర్ లాగింగ్ కావటం వంటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ రౌండ్ ది క్లాక్ పని చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒక్కో మున్సిపల్ వార్డులో అందుబాటులో ఉంచిన మూడు మాన్సూన్ టీమ్‌లు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ, విధులు నిర్వర్తించేలా మూడు షిఫ్టులకు టీమ్‌లను సిద్ధం చేశారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 30 డీఆర్ఎఫ్ టీమ్‌లు కూడా సహాయక చర్యల కోసం సిద్దంగా ఉంచినట్లు సమాచారం. వర్షం భారీగా కురుస్తున్నపుడు సహాయక చర్యల కోసం, ఫిర్యాదులను సమర్పించేందుకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111తో పాటు మై జీహెచ్ఎంసీ యాప్, డయల్ 100కు ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచించారు.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి నీరు.. ప్రజలు ఇక్కట్లు!

అదే నిర్లక్ష్యం, అవినీతి!

వర్షాకాలానికి ముందే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రవహించే 380 కిలోమీటర్ల పొడవున్న మేజర్ నాలాలు, మరో 600 కి.మీ,ల పైచిలుకు పొడువున ప్రవహించే చిన్న, మధ్య తరహా నాలాల్లోని పూడికతీత పనులను సకాలంలో పూర్తి చేయటంలోనూ జీహెచ్ఎంసీ విఫలమైంది. విధి నిర్వహణ పట్ల అధికారుల్లో చిత్తశుద్ధి లోపించటం, కోట్లాది రూపాయలు వెచ్చించినా, సకాలంలో నాలాల్లోని పూడికతీత పనులు పూర్తి కాకపోవటంతో ఈ సారి మళ్లీ వరద ముప్పు తప్పేట్టు లేదన్న భాయందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూ.55 కోట్లతో చేపట్టిన 327 నాలా పూడికతీత పనులు ఈనెల చివ‌రికి పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పనులపై కమిషనర్, ఇంజనీర్ల చిత్తశుద్ధి ఏ పాటిదో అంచనా వేసుకోవచ్చు.

70 శాతం పూడికతీత పనులు పూర్తిచేశామని అధికారులు చెప్పుకుంటున్నా, బల్కాపూర్ వంటి మేజర్ నాలాల్లో ఇప్పటి వరకు సుమారు 10 నుంచి 15 ఫీట్ల ఎత్తు వరకు ఇంకా పూడికతో నిండి దర్శనమిస్తున్నది. ఇంకా వంద‌లాది కిలోమీట‌ర్ల పొడువున నాలాల్లో, వ‌ర‌ద నీటి కాలువ‌ల్లో పూడిక‌ పేరుకుపోయి ఉండటం కన్పిస్తోంది. చేయని పనులకు కూడా ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు కుమ్మక్కై బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గంట వ్యవధిలోనే రెండు సెంటీ మీట‌ర్ల వ‌ర్షం ప‌డితే మాత్రమే తట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న వరద నీటి కాలువల వ్యసస్థలు గట్టిగా వర్షం పడితే పొంగి పొర్లి ప్రవహించనున్నాయి.

70 శాతం పనులు పూర్తి

23 డ్రెయిన్లలో రీసైక్లర్స్ ద్వారా, 214 చిన్న సైజు నాలాల్లో మ్యాన్‌వ‌ల్‌గా పూడిక‌ను తీయాలని నిర్ణయించారు. నాలాల్లో పూడిక, వ్యర్థాలను తొల‌గించ‌డంతో పాటు పూడిక, మ‌ట్టిని స‌మీపంలోని డంపింగ్ యార్డుకు త‌ర‌లించే బాధ్యత కూడా కాంట్రాక్టర్లే చేప‌ట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ బ‌ల్దియా ప‌రిధిలో మొత్తంగా మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తం పూడిక 5 ల‌క్షల 42వేల 239 క్యూబిక్ మీటర్లు ఉంటుందని అంచనా వేశారు.

ఇప్పటి వరకు అన్ని నాలాల్లో కలిపి మొత్తంగా 70 శాతం పూడికను మాత్రమే తొలగించిన జీహెచ్ఎంసీ మరో 30 శాతం పూడిక తొలగించాల్సి ఉంది. ఈసారి వర్షాలు కాస్త ముందుగానే దంచి కొడుతాయని ఐఎండీ హెచ్చరించినా ప్రక్రియను వేగవంతం చేయంపై జీహెచ్ఎంసీ చొరవ చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులకు డెడ్ లైన్‌గా విధించిన ఈ నెలాఖరు ముగిసేందుకు ఇంకా 8 రోజుల సమయమే మిగిలి ఉన్నందున, అంతలోపు మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేస్తారా? చేయకుండానే బిల్లులు క్లెయిమ్ చేస్తారనేది చూడాలి.

Also Read: Allu Arjun: ఈ విషయం తెలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భూమ్మీద నిలబడరేమో..

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ