GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే అత్యవసరమైన సేవల్లో శానిటేషన్ ప్రధానమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుగా, ఫాస్ట్ గా నిర్వహించటంపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మెరుగైన శానిటేషన్ కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్న కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ వీధుల్లో, సబ్ రోడ్లలో, చెట్ల కింద, షాపుల పక్కనే ఎవరూ ఉపయోగించకుండా మూలనపడేసిన కార్లు చెత్తకు నిలయంగా మారుతున్నాయన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ముఖ్యంగా ఒక చోట పార్కింగ్ చేసి, రోజూ వినియోగించి, పార్కింగ్ చేసుకునే కార్ల మాట అలా ఉంచితే రోజులు, నెలల తరబడి వినియోగించకుండా ఒక చోట వదిలేసిన కార్లను యార్డుకు తరలించి, అక్కడ వాటిని ఖంఢం చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.
Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మెరుగైన శానిటేషన్ కోసం ఇటీవలే జీహెచ్ఎంసీ రెండు దశలుగా నిర్వహించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చాలా రోజుల నుంచి రోడ్లకిరువైపులా, చెట్ల కింద, పార్కుల్లో, మైదానాల్లో, గ్రౌండ్స్ లో పేరుకుపోయిన వేలాది టన్నుల చెత్తను తరలించే సమయంలో వాడుకుండా మూలనపడేసిన కార్లను కూడా అధికారులు గుర్తించారు. వీటిని కూడా తొలగిస్తే చాలా వరకు చెత్త పేరుకుపోయిన, చెత్తకు నిలయంగా మారుతున్న గ్యార్బేజీ పాయింట్లను తగ్గించుకోవచ్చునని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి తొలుత సర్కిళ్ల వారీగా సర్వే నిర్వహించాలని కమిషనర్ డిప్యూటీ కమిషనర్లను శనివారం ఆదేశించినట్లు సమాచారం. ప్రతి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాడకుండా రోడ్లకిరువైపులా, చెట్ల కింద, మైదానాల్లో పార్కు చేసిన కార్లను, ఇతర వాహానాలను గుర్తించాలని, బాగా దుమ్మూ, ధూళితో నిండిపోయి, లోపల చెత్త తో నిండిన వాహానాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని కమిషనర్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించినట్లు సమాచారం.
సహకరిస్తారా?
చాలాకాలంగా వినియోగించుకుండా పక్కన పారేసిన కార్లు, ఇతరాత్ర వాహానాలను తరలించేందుకు జీహెచ్ఎంసీ వద్ద ప్రత్యేకంగా క్రేన్లు వంటివి లేకపోవటంతో సిటీ ట్రాఫిక్ విభాగంతో సమన్వయం ఏర్పర్చుకునేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సిటీలో రద్దీ రోడ్లలో అక్రమంగా పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహానాలను ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రత్యేకమైన క్రేన్ తో తరలిస్తుంటారు. వాడకుండా పక్కన పారవేసిన కార్లు వంటి వాహానాలను దుండిగల్ లోని జీహెచ్ఎంసీకి చెందిన సీ అండ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరుతున్నట్లు తెలిసింది. ఇందుకు సిటీ ట్రాఫిక్ వింగ్ జీహెచ్ఎంసీకి సహకరిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
యార్డుకు తరలించిన వాహానాన్ని ఓనర్ క్లెయిమ్ చేస్తే?
ఒక చోట చాలా రోజులుగా, నెలలుగా వినియోగించుకుండా ఉంచిన కారు ఇతర వాహానాలను జీహెచ్ఎంసీ క్రేన్ సహయంతో దుండిగల్ లోని యార్డుకు తరలించిన తర్వాత ఆ వెహికల్ ను ఓనర్ క్లెయిమ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. ఓనర్ క్లెయిమ్ చేసే వాహానం లైఫ్ ఇంకా ఉన్నట్లయితే, అందుకు సంబంధించి ఓనర్ ట్యాక్స్ చెల్లించి ఉంటే, ఓనర్ షిప్ ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పార్కింగ్ చేసి ఉంచిన ప్రాంతం నుంచి దుండిగల్ యార్డుకు వాహానాన్ని తరలించినందుకు ట్రాన్స్ పోర్టు ఛార్జీలు వడ్డించి, ఆ ఛార్జీలు చెల్లించిన తర్వాత ఓనరే తన సొంత ఖర్చుతో వాహానాన్ని తిరిగి తీసుకెళ్లేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టనుంది. ఈ రకంగా పార్కింగ్ చేసి వదిలేసిన కార్లను గుర్తించాలని కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో అన్ని సర్కిళ్ల నుంచి మరో వారం రోజుల్లో నివేదికలు వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులతో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే ఆలోచనలో అధికారులున్నట్లు సమాచారం.
Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
