GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్ మాత్రమే కాదు..
GHMC (Image Source: X)
హైదరాబాద్

GHMC: అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ మాత్రమే కాదు.. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు!

GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ లలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఫలితంగా ఉన్న ఆదాయ మార్గాలను కూడా సక్రమంగా వసూలు చేసుకోవటంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ వింగ్‌ల సిబ్బంది.. అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నిర్మితమై ఉపయోగంలోకి వస్తున్న భవనాలకు ప్రాపర్టీ ట్యాక్స్‌ను విధించటంలో ట్యాక్స్ సిబ్బంది, వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయటంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశాబ్దాల కాలం నుంచి పైసా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచకుండానే ఏటా ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటున్న జీహెచ్ఎంసీ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న రూ. 2 వేల కోట్ల ట్యాక్స్ కలెక్షన్‌ను లక్ష్యానికి మించి రూ. 2038 కోట్ల మేరకు వసూలు చేసుకుంది. ఇంకా ట్యాక్స్‌ను పెంచుకునే అవకాశమున్నట్లు గుర్తించిన అధికారులు గత సంవత్సరం జూలై మాసం నుంచి సిటీలోని అన్ని ప్రాపర్టీలపై జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.

ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌లలో భారీగా అక్రమాలు

ఈ సర్వేతో అధికారులు నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సిటీలోని ఆరు జోన్లలో సుమారు 97 వేల ఆస్తులు విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంటు మీటర్లను తీసుకుని కమర్షియల్ కరెంటు బిల్లులు చెల్లిస్తూనే, జీహెచ్ఎంసీకి మాత్రం రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 97 వేల ప్రాపర్టీలను కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ట్రేడ్ లైసెన్స్‌లలో మరో అక్రమం బయట పడింది.

అన్నపూర్ణ స్టూడియో. రామానాయుడు స్టూడియోస్‌లు తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్న విషయాన్ని స్థానిక సర్కిల్ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. స్టూడియోల కమర్షియల్ విస్తీర్ణం తక్కువ చూపిస్తూ.. భారీగా ట్రేడ్ లైసెస్స్ ఛార్జీలను తక్కువగా రికార్డుల్లోకి ఎక్కించి, తక్కువ ఫీజును వర్తింపజేసినట్లు గుర్తించారు. అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) రూ.11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు స్థానిక సర్కిల్ ట్యాక్స్ వింగ్ అధికారులు గుర్తించారు. అలాగే రామానాయుడు స్టూడియో (Rama Naidu Studio) వినియోగిస్తున్న తీరును బట్టి రూ. 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు సర్కిల్- 18 అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఇటీవలే సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఓ బడా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా లక్షల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా, స్థానిక ట్యాక్స్ సిబ్బందిని మేనేజ్ చేసుకుని కేవలం వేలలో ప్రాపర్టీ ట్యాక్స్ చెలిస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చినా.. అధికారులు మౌనం వహించటం జీహెచ్ఎంసీలో అక్రమాలకు నిదర్శనం.

అక్రమార్కులను బాధ్యులను చేయరా?

నేరుగా జీహెచ్ఎంసీ ఖజానాకు ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో రావాల్సిన నిధులు భవన యాజమానులకు ఆదా కావటం, ట్యాక్స్ సిబ్బంది జేబుల్లోకి వెళ్లటం వంటి వ్యవహారాలు వరుసగా వెలుగులోకి వస్తున్నా, అందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవటంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. తాజాగా వెలుగుచూసిన రెండు స్టూడియోలు చెల్లించాల్సిన ట్రేడ్ ఛార్జీల కన్నా తక్కువ ఛార్జీలను దశాబ్దాల కాలంగా చెల్లిస్తుండటంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన కోట్లాది రూపాయలు బడా బాబులకు మిగిలిపోగా, లైసెన్స్ లు జారీ చేసే సమయంలో తక్కువ ఏరియాను చూపించి, తక్కువ ట్రేడ్ ఛార్జీలను వర్తింపజేసిన సిబ్బందిని గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటారా? అన్నది జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్టూడియోలకు ట్రేడ్ లైసెన్స్ లను జారీ చేసిన సిబ్బందిని బాధ్యులను చేసి ప్రశ్నించే అవకాశమున్నా, అధికారులు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదన్నది హాట్ టాపిక్‌గా మారింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!