GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు.. బల్దియా బాస్ ఫుల్ సీరియస్

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కల్గించేందుకు సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హెచ్ సి(H-City)టీ పనుల తీరుపై జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) ఇంజనీరింగ్ వింగ్ పై మంగళవారం సీరియస్ అయ్యారు. పనులను వేగవంతం చేసేలా అధికారులు పని తీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని కూడా అల్టిమేటం జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెచ్ సిటీ పనుల్లో భాగంగా ఎస్ ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ పనులకు సంబంధించి కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, స్థల సేకరణ విభాగాల అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

హెచ్ సిటీ పనులపై ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్ కు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ప్రతిబంధకాలు, క్షేత్ర స్థాయి సవాళ్లు, పెండింగ్ పనులు, అందుకు గల కారణాలను తెలిపారు. ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ కింద చేపట్టిన పనులు ప్రారంభించి చాలా రోజులైనందున వేగంగా పూర్తి చేసేందుకు మిషన్ మోడ్ లో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. సిటీలోని ఆరు జోన్లలో లేక్ ల అభివృద్ధిలో భాగంగా 83 పనులు చేపట్టగా, 25 పనులు మాత్రమే ప్రారంభం కావడం, లేక్స్ అభివృద్ధి, పునరుద్ధరణ పనులు నెమ్మదిగా జరగడంపై కమిషనర్ మండి పడ్డారు.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

అధికారులకు దిశా నిర్దేశం..

ఇరిగేషన్ ఇంజనీర్లు సరిగా పనిచేస్తలేరని, వారం రోజుల్లో లేక్స్ అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ల ద్వారా క్షేత్రస్థాయి తాజా రిపోర్టు తీసుకుంటామని, పనుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. జోనల్ అధికారులు తమ పరిధిలో జరుగుతున్న లేక్స్ అభివృద్ధి పై సమీక్షించి చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వ‌ల మ‌ళ్లింపు పనులు వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల వేగంగా పూర్తికి కమిషనర్ ఆర్ వి కర్ణన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్ట్ ల పూర్తికి నిధుల కొరత లేదని న్నారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

ఇష్యూస్ ఏమైనా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంటే తనకు తెలియజేస్తే వెంటనే క్లియర్ చేస్తానని చెప్పారు. పనులు జరిగే ప్రదేశాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులతో ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 25 వ తేదీలోగా ఫలక్ నుమా ఆర్వోబీ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలనీ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమీక్షలో జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి , హేమంత్ పాటిల్, అపూర్వ చౌహాన్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్ట

మాజీ మంత్రి జానారెడ్డిని కలిసిన కమిషనర్

మంగళవారం ఉదయం కేబీఆర్ పార్కు వద్ద పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాజీ మంత్రి జానారెడ్డిని కలిసి, కేబీఆర్ పార్కు స్థల సేకరణపై చర్చించినట్లు సమాచారం. ప్రజాప్రయోజనాల కోసం చేపడుతున్న హెచ్ సిటీ పనులకు సహకరించాలని కమిషనర్ జానారెడ్డిని కోరినట్లు తెలిసింది. కేబీఆర్ చుట్టూ చేపట్టాల్సిన హెచ్ సిటీ పనుల్లో జానారెడ్డికి చెందిన స్థలం కూడా ఎఫెక్టు అవుతున్నందున, స్థల సేకరణకు అంగీకరించాలని కమిషనర్ కోరినట్లు సమాచారం.

Also Read: Splitsville review: ఈ బోల్డ్ కామెడీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా..

Just In

01

Huzurabad Collector: మద్యం షాపులో అంగన్‌వాడీ గుడ్లపై.. కలెక్టర్ ఆగ్రహం

Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!

Big Breaking: తెలంగాణలో ఓజీకి ఎదురుదెబ్బ.. ప్రీమియర్స్ ఇక లేనట్లేనా?

Jogulamba Temple: జోగులాంబ ఆలయ మిస్టరీ.. అమ్మవారిని నేరుగా ఎందుకు దర్శించుకోరో తెలుసా?

OTT Movie: ఈ సీరియల్ కిల్లర్‌కు దొరికితే అంతే.. భయపడితే మాత్రం చూడకండి