Transfers In GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) పరిపాలనలో తనదైన ముద్ర వేసే దిశగా కీలకమైన అంతర్గత బదిలీలను చేపట్టారు. (GHMC) జీహెచ్ఎంసీలో ఏకంగా 14 మంది అడిషనల్ కమిషనర్లు ఉండటంపై ఆయన గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, అడిషనల్ కమిషనర్ల బాధ్యతల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది అధికారులను నుంచి బాధ్యతలు తొలగించగా, మరికొందరికి ఒకటి కంటే ఎక్కువ విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పుల ద్వారా అడిషనల్ కమిషనర్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది.
Also Read: ACB Raids: ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ మెరుపుదాడులు.. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు.. కారణమిదే!
ప్రధాన బదిలీలు..
❄️వేణుగోపాల్ రెడ్డి (అడ్వర్టైజ్‌మెంట్, ఎలక్ట్రికల్ అడిషనల్ కమిషనర్): ఆయన నుంచి అడ్వర్టైజ్‌మెంట్ విభాగాన్ని తొలగించారు.
❄️అనురాగ్ జయంతి (ఐఏఎస్): ఇప్పటికే ఐటీ, రెవెన్యూ విభాగాల బాధ్యతలు చూస్తున్న ఆయనకు అడ్వర్టైజ్‌మెంట్ విభాగం అదనంగా కేటాయించబడింది.
❄️ఎన్. యాదగిరిరావు (స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్): ఈ బాధ్యతల నుంచి తప్పించి, ఆయనకు ఎలాంటి బాధ్యతలు కేటాయించలేదు.
❄️సుభద్రాదేవి (యూసీడీ అడిషనల్ కమిషనర్): ఈమెకు స్పోర్ట్స్ విభాగాన్ని అదనంగా అప్పగించారు.
❄️ఎస్. పంకజ (హెల్త్ అడిషనల్ కమిషనర్): ఆమెను హెల్త్ విభాగం నుంచి తప్పించి, యూసీడీ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు.
❄️రఘుప్రసాద్: సీనియారిటీ ఆధారంగా హెల్త్, శానిటేషన్ విభాగాల బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
❄️పీ సరోజ (విజిలెన్స్ ఎంక్వైరీ అడిషనల్ కమిషనర్): ఆమెకు డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీస్ బాధ్యతలు అప్పగించారు.
❄️ఎన్. శంకర్ (కూకట్‌పల్లి జోన్ జాయింట్ కమిషనర్): ఈయనను హెల్త్ విభాగం జాయింట్ కమిషనర్‌గా నియమించారు.
❄️ఎన్. అశోక్ సామ్రాట్ (ఎస్టేట్ అడిషనల్ కమిషనర్): ఈయనను శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ జోన్‌ల శానిటేషన్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
❄️కే. జయంత్ రావు (హెల్త్ జాయింట్ కమిషనర్): ఆయనను మున్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి బదిలీ చేశారు.
❄️స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ & హౌజింగ్: ఈ విభాగాల బాధ్యతలను అడిషనల్ కమిషనర్ల నుంచి తప్పించి, ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించారు. స్ట్రీట్ లైట్ బాధ్యతను చీఫ్ ఇంజినీర్‌కు, హౌజింగ్ విభాగాన్ని హౌజింగ్ చీఫ్ ఇంజినీర్‌కు కేటాయించారు.
❄️అలివేలు మంగతాయారు (ఎలక్షన్ అడిషనల్ కమిషనర్): ఆమెకు ఎస్టేట్ విభాగాన్ని అదనంగా కేటాయించారు.
బాధ్యతలు కోల్పోయిన అధికారులు..
అడిషనల్ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న నిళిని పద్మావతి, (Venugopal) వేణుగోపాల్‌కు ప్రస్తుత బదిలీల్లో ఎలాంటి బాధ్యతలు కేటాయించలేదు. నిళిని పద్మావతి తిరిగి సీడీఎంఏకు వెళ్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, జీహెచ్ఎంసీ (GHMC) ఉద్యోగి అయిన వేణుగోపాల్ కమిషనర్ ఓఎస్‌డీగా కొనసాగే అవకాశం ఉంది.
ఆ ఒక్క విభాగం అలాగే..
దాదాపు అన్ని విభాగాల్లో మార్పులు చేసినా, అత్యంత ముఖ్యమైన ఫైనాన్స్ విభాగం అడిషనల్ కమిషనర్ గీతారాధికను మాత్రం అదే పోస్టులో కొనసాగించారు. ప్రభుత్వ బకాయిలు రాబట్టడంలో ఆమె కృషి, కొత్త ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్ నిధులు రూ. 1,300 కోట్లు తీసుకురావడంలో ఆమె పనితీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Also Read: Sardarnagar village: సర్దార్‌నగర్ సంతలో.. అక్రమ వసూళ్లు!