Sridhar Babu: దేశంలోనే తొలి బయోలాజికల్ సింగిల్ యూజ్
Sridhar Babu (image credit: swetcha reporter)
హైదరాబాద్

Sridhar Babu: దేశంలోనే తొలి బయోలాజికల్ సింగిల్ యూజ్ స్కేల్ ఆఫ్ ఫెసిలిటీ ప్రారంభం : మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu:  జీనోమ్ వ్యాలీకి కొత్త గుర్తింపు గేట్ వే నిర్మాణం అని, రూ.200కోట్లకు పైగా ప్రణాళిక బద్దమైన మౌలిక సదుపాయాల ఆధునీకరణలతో పాటు లైఫ్ సైన్సెస్ లో ప్రపంచ నాయకత్వం తదుపరి దశ వృద్ధికి ఈ క్లస్టర్ ను సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం లోగోను ఆవిష్కరించారు. ఈ లోగో క్లస్టర్ పరిశోధన, ఆధారిత బయోటెక్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా రూపాంతరం చెందడాన్ని సూచిస్తుందన్నారు. రాష్ట్ర రహదారి వెంట జీనోమ్ వ్యాలీ ప్రవేశ ద్వారం వద్ద నిర్మించబోయే ల్యాండ్ మార్క్ గేట్ వే నిర్మాణం కోసం డిజైన్ ను సైతం విడుదల చేసి ఇది క్లస్టర్ గుర్తింపు, ప్రపంచ స్థానాన్ని పునరుద్ఘాటిస్తుందన్నారు.

Also  Read:Sridhar Babu: రూ.5 లక్షల కోట్ల స్కాం.. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడు!

కొత్త గ్రీన్ పీల్డ్ రోడ్లు, విద్యుత్ విస్తరణ

క్లస్టర్ తదుపరి దశ విస్తరణకు మద్దతుగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ప్రాస్ట్రక్షర్ అండ్ ఇన్వెస్ట్ మెంద్ కార్పొరేషన్ చేపట్ట నున్న రూ.200కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల నవీకరణలను ప్రకటించారు. వీటిలో రోడ్ల విస్తరణ, కొత్త గ్రీన్ పీల్డ్ రోడ్లు, విద్యుత్ విస్తరణ, ల్యాండ్ స్కేపింగ్, స్ట్రీట్ స్కేపింగ్ మెరుగుదల, క్లస్టర్ లోకనెక్టివిటీ, యుటిలిటీ విశ్వసనీయత, మొత్ం జీవన నాణ్యతనే పెంచే కీలకమైన ఆధునీకరణలు ఉన్నాయన్నారు.

తెలంగాణ బయో ఫార్మా హబ్

జీనోవ్ వ్యాలీ ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థ ప్రధాన విస్తరణను వెల్లడిస్తూ దేశంలోనే మొట్టమొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్, స్కేల్ అఫ్ ఫెసిలిటీ, తెలంగాణ బయో ఫార్మా హబ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం బయో ఫార్మా హౌజ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్యం, ఐటీఈసీ విభాగాల ప్రత్యేక ప్రధానకార్యదర్శి సంజయ్ కుమార్, శక్తి ఎం నాగప్పన్, టోనీ అక్సియారిటో, శ్రీనాథ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Also  Read:Sridhar Babu: గత ప్రభుత్వంలోనే ఆర్థిక అరాచకం.. కేటీఆర్‌‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. లక్ష కోట్లు

శామీర్‌పేట్ మండలం, జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు అయిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ యొక్క రెండు కొత్త కేంద్రాలను సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం పటిష్టమైన అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తోందని తెలిపారు. 2030 నాటికీ లైఫ్ సైన్సెస్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ సామర్థ్యాలతో కూడిన ఈకో సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి థర్మో ఫిషర్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కొత్త కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

రూ. 85 నుండి 90 కోట్ల వరకు పెట్టుబడులు

ఈ కొత్తగా ప్రారంభించిన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (సీఈసీ), శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు (ఎంటర్‌ప్రెన్యూర్లు), పరిశ్రమ నిపుణులకు స్వయంగా పనిచేస్తూ నేర్చుకునే మరియు కలిసి పనిచేసే అవకాశాలను అందించే ఒక భాగస్వామ్య హట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడం, పెట్టుబడులను కొనసాగించడంలో భాగంగా, ఈ సీఈసీ, బీడీసీలపై థర్మో ఫిషర్ సంయుక్తంగా రూ. 85 నుండి 90 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతుందని కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రెసిడెంట్ టోనీ యాక్సియారిటీ, ఇండియా అండ్ సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ వెంకటేశ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?