Hydraa: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలాల్లో పడి గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం హైడ్రా(Hydraa) ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించింది. క్యాచ్‌పిట్లన్ని చోట్ల వెతుకుతోందని, ఆసిఫ్‌నగర్ లోని అఫ్జల్ సాగర్ నాలాతో పాటు ముషీరాబాద్‌లోని వినోభానగర్ నాలా పరిసరాల్లో గాలింపు చర్యలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) క్షేత్ర స్థాయిలో ఉదయం పరిశీలించారు. ప్రతి క్యాచ్‌పిట్‌ను తెరిచి చూసిన తర్వాత వెంటనే వాటిని మూసి వేయాలని హైడ్రా సిబ్బందికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. గాలింపు చర్యలను మిగతా శాఖలతో కలిసి ముమ్మరం చేయాలని సూచించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన(Collector Harichandana) కూడా అఫ్జల్ సాగర్ పాంత్రంలో కమిషనర్‌తో పాటు గాలింపు చర్యలను పరిశీలించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన భారీ వర్షానికి ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్ సాగర్ నాలాలో అక్కడే నివాసం ఉంటున్న మామ, అల్లుడు అర్జున్(26), రాము (25) తో పాటు ముషీరాబాద్‌లోని వినోభానగర్ నాలాలో దినేష్ అలియాస్ సన్నీ(26) గల్లంతైన విషయాన్ని నిర్థారించారు. సోమవారం కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు హైడ్రా వెల్లడించింది.
ప్రమాదాలకు ఆక్రమణలే కారణం
నాలాల ఆక్రమణలే ప్రమాదాలకు కారణమని గాలింపు చర్యలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నాలాలను ఆక్రమించి నిర్మించడమే గాకా, వాటి ప్రవాహాన్ని అశాస్త్రీయంగా దారి మల్లించడంతో వరద సాఫీగా సాగడంలేదన్నారు. వరద ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒకటి రెండు కట్టడాలనే తొలగిస్తామని, మిగతా వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కమిషనర్ వెల్లడించారు. నాలాల చెంతన పేదలే ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, తప్పనిసరిగా కూల్చి వేయాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూస్తుందన్నారు. మిగతావారెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పేదల పట్ల ప్రభుత్వానికి వారికి ప్రత్యామ్నాయ నివాసాలు కేటాయించాలన్న సానుభూతి ఉందని, డ్రా కూడా అదే తీరుతో పని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Telangana: బోడుప్పల్ ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కాలేజీలో ర్యాగింగ్ దాడి..
ప్రతి ఏటా ఇదే సమస్య..
ప్రతి ఏటా వర్షాకాలంలో వ్యక్తులు గల్లంతవుతున్న ఘటనలు జరుుతున్నాయని స్థానికులతో పాటు నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్(MLA Majid Hussain) వెల్లడించారు ఈ సమస్య మూలాలు వెతికి పరిష్కరించాల్సినవసరం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ(GHMC), ఇరిగేషన్(Irrigation), రెవెన్యూ(Revenue) శాఖలతో కలిసి అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్తామని, పేదల నివాసాలు పెద్ద మొత్తంలో ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. భారీ వర్షం పడితే అమీర్‌పేట పరిసరాలు నీట మునిగేవని, అక్కడ అండర్ గ్రౌండ్ లో పూడుకుపోయిన నాలాలను తెరవడంతో సమస్య పరిష్కారమయిందని తెలిపారు. సుమారు 25 లారీల పూడికను ఒకే చోట తీసినట్టు చెప్పారు. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకూ 2200ల లారీల పూడికను తొలగించామని, ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతోందని, నగరవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాలను పరిశీలిస్తున్న పొరుగు రాష్ట్రాల వారు అక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నట్లు ఆయన వివరించారు.
Also Read: Supreme Court: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ