Ranjit Kumar Singh (imagecredit:swetcha)
హైదరాబాద్

Ranjit Kumar Singh: ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు: రంజిత్‌ కుమార్‌ సింగ్‌

Ranjit Kumar Singh: జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఎన్నికల ఫిర్యాదులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(Model Code of Conduct) ఉల్లంఘనలపై వెంటనే స్పందించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌(Ranjit Kumar Singh) ఎలక్షన్ వింగ్ అధికారులకు సూచించారు. ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు.

ఆకస్మికంగా తనిఖీ..

జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్, ఎంసీసీ కంట్రోల్ రూం, 1950 ఫిర్యాదుల కేంద్రాన్ని వ్యయ, పోలీస్, సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌, ఓం ప్రకాశ్‌ త్రిపాఠి, సంజీవ్‌ కుమార్‌ లాల్‌‌లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుల రిజిస్టర్‌ల నిర్వహణ, నమోదు చేస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికకు సంబంధించి ఎంసీసీ, ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్, సీ-విజిల్, రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంట్రోల్ ఉల్లంఘనలపై వెంటనే స్పందిస్తూ క్షేత్రస్థాయి ఎఫ్ఎస్‌టీ(FST), వీఎస్‌టీ(VST), ఎఫ్ఎస్‌టీ(FCT) బృందాలకు సమాచారం అందిస్తూ సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణన్ పరిశీలకులకు వివరించారు.

Also Read: Riyaz Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత.. కానిస్టేబుల్ భార్య ఎం చెప్పారో తెలుసా..!

పదికి పైగా కేసులు నమోదు..

ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ భారత ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.2 కోట్ల 75 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కోడ్ ఆఫ్ కండక్టర్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై పదికి పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఉల్లంఘనలపై బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌ అధికారులకు తెలిపారు.

Also Read: CM Revanth Reddy: రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు