Keesara Police: కీసర ప్రధాన కూడలిలో తెల్లవారుజామున దొడ్ల మిల్క్ కంపెనీ మేనేజర్ శ్రీనివాస్‌పై తల్వార్‌తో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కీసర పోలీసులు (Keesara Police) వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం నగరంలోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల విచారణలో బాధితుడు మౌలాలి వాసిగా గుర్తించారు.
Also Read: Keesara Man Arrested: గంజాయితో పట్టుబడి కటకటాల పాలైన వ్యక్తి.. చివరికి!
ఇద్దరి మధ్య వాగ్వాదం
ఈ ఘటనకు పాల వ్యాపారి కిరణ్ కారణమని పోలీసులు తెలిపారు. కిరణ్ గత కొంతకాలంగా పాల వ్యాపారం చేస్తూ దొడ్ల కంపెనీకి బకాయిలు చెల్లించకుండా ఉన్నాడని, ఆ బకాయిల వసూళ్ల విషయమై శ్రీనివాస్‌కు, కిరణ్‌కు మధ్య గతంలోనే గొడవలు జరిగినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో తెల్లవారుజామున శ్రీనివాస్ కీసరకు వచ్చి, కిరణ్‌కు పాలు వేయొద్దని వ్యాన్ డ్రైవర్‌కు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన కిరణ్ తల్వార్‌తో శ్రీనివాస్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు నిందితుడు కిరణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Gadwal Collector: అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్

