Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆరంభం అదిరేలా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ జరూర్ ఆనా.. ప్రపంచం కళన్నీ తెలంగాణవైపే.. తెలంగాణలో మెదటిసారి ప్రపంచ అందాల సుందరీమణుల పోటీలు జరగనున్నాయి. ఈనెల 10 నుంచి 31 దాకా దశల వారీగా జరిగే పోటీల కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మరి ముఖ్యంగా తెలంగాణ సంసృతి సంవ్రదాయం తెలిసేలా కల్చరల్ అక్టివిటీస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇతర దేశాల అందాల తారలు రాష్టంలో అడుగు పెట్టడంతోనే తెలుగుదనం ఉట్టిపడేలా బొట్టుపెట్టి , డప్పుచప్పులు కళానృత్యాలతో ఆహ్వానిస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ను ముస్తాబు చేస్తున్నారు. దాదాపు 116 దేశాల నుంచి కంటెస్టెంట్లు.. వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. పోటీలో పాల్గొనే అందగత్తెలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారతీయ, తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. అందాల పోటీల్లో మన కట్టు బొట్టు భాషా,మన సంసృతి,సంప్రాదాయంతో పాటు మన చరిత్ర ,కట్టడాలు, పర్యాటకం తెలిసేలా అన్ని శాఖల సమన్వయంతో పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణవైపే ఉన్నాయి. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ,కల్చర్ ను హైలెట్ చేయడం, కోసం అన్ని ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.
Also read: Chamala Kiran: కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. చామల షాకింగ్ కామెంట్స్
ఈ నెల 10 గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభిస్తున్నారు. ఆ రోజు 1500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు ఇవ్వనున్నారు. తెలంగాణ సంస్కృతి తెలిసేలా జానపద కళాకృతులు డప్పు,డోలు, కొమ్మకోయా, గుస్సాడి, కోలాటం,తో పాటు కూచిపూడి ,పెరిణి తో పాటు వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు ఈ పోటీలో స్ఫెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి. పోటీల్లో పాల్గొనే పోటీదారులను, వచ్చే మీడియాను సైతం అమితంగా ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మరోవైపు పోటీలను విజయవంతం చేసేందుకు అధికారులను నియమించినట్లు తెలిసింది.
వారికి ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం 22 ప్రాంతాలకు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పోటీదారులను తీసుకెళ్తున్నారు. అయితే ఆయా ప్రాంతాలను బట్టి ప్రోగ్రాములను ఫిక్స్ చేస్తున్నారు. రామప్ప ఆలయ సందర్శన కు వెళ్లినప్పుడు బతుకమ్మ, బోనాలు, కోలాటం, పెరిని కళాకారులు నృత్యాలు, పోచంపల్లికి వెళ్ళినప్పుడు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. తెలంగాణ బ్రాండ్ , ప్రతిష్టను ప్రపంచం దృష్టికి తిసుకెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై మంత్రి జూపల్లి ఆగ్రహం
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలన
మిస్ వరల్డ్ పోటీలకు ఒక్కరోజే ఉండటం పనులు పూర్తి స్థాయిలో జరుగకపోవడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. స్వాగత తోరణాలను కార్డు బోర్డులతో కాకుండా తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి, అరటి ఆకులు, పూలతో ఘనంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
స్వాగతం ఆర్చులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏర్పాట్లు చేయవద్దని, వారేదో చూపిస్తే మీరెందుకు వాటికి ఓకే చెబుతున్నారని అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సంప్రదాయం ఎక్కడా కనిపించడం లేదని ఏం చేస్తున్నారని నిలదీశారు.
భరత నాట్యం, కథక్, పేరిణి నృత్యాలు, సన్నాయి మేళం, భజంత్రీలు, తెలంగాణ కలలు, సాంస్కృతి, హ్యాండ్ క్రాప్ట్స్, చేర్యాల నకిశీలు, గుస్సాడి నృత్యాలు ఇలా ప్రతీ తెలంగాణ సాంప్రదాయం అడుగడుగునా ఉట్టిపడాలని, ప్రపంచ వేదికపై తెలంగాణ వైభవం కనిపించాలని అధికారులను ఆదేశించారు.
స్వాగతం చెప్పే ఆర్చిలో మామిడి తోరణాలు, అరిటాకులు, పూలతో ఏర్పాటు చేయాలని, మిగతా ఏర్పాట్లను ఈనెల 10వ వరకు పూర్తి చేయాలని, ఏర్పాట్లలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి మామిడి హరికృష్ణను ఏర్పాట్లపై నిలదీశారు. దగ్గరుండి పనులు కంప్లీట్ చేయాలని సూచించారు.