Hydra Survey (magecreedit:twitter)
హైదరాబాద్

Hydra Survey: హైడ్రా సంచలన నిర్ణయం.. జీహెచ్ఎంసీ నుండి ఔటర్ వరకు సర్వే!

Hydra Survey: ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు సర్కార్ ఆస్తులను పరిరక్షించేందుకు హైడ్రా మరో హైడ్రోలాజికల్ సర్వే నిర్వహించనున్నది. ఇందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధి పెరిగే అవకశమున్నందున ఔటర్ వరకున్న వివిధ ప్రాంతాల్లో విపత్తుల నిర్వహణ, నివారణ అంశంపై హైడ్రా ఫోకస్ చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీని ఔటర్ వరకు విస్తరించాలన్న సర్కారు ప్రతిపాదన మేరకు ఔటర్ వరకు ఉన్న నీటి వనరులు, హైడ్రాలిక్ ఫీచర్స్‌పై సర్వే చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సర్వే నిర్వహణకు ఈ వర్షాకాలమే చాలా అనుకూలమని హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం.

ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వర్షపు నీరు ఆగుతుంది? వాటర్ స్టాగినేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది? అందుకు కారణాలను గుర్తించేందుకు సులువుగా ఉంటుందని హైడ్రా భావించింది. ఈ మేరకు వర్షాకాలంలోనే సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సర్వేతో సేకరించనున్న డేటా మున్ముందు జీహెచ్ఎంసీ పరిధిని పెంచిన తర్వాత నీటి వనరుల నిర్వహణ, మానిటరింగ్, ప్లానింగ్ కోసం ఉపయోగపడుతుందని హైడ్రా భావిస్తున్నది. నాలుగైదు రోజుల్లోనే ఈ సర్వేను ప్రారంభించేందుకు హైడ్రా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Cm Revanth Reddy: బీఆర్ఎస్ గొర్రెలు, బర్రెలు ఇస్తే.. మేం ఉద్యోగాలిచ్చాం.. సీఎం రేవంత్

ఇదీ నాలుగో సర్వే

ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీ గ్రేటర్ కాక ముందు 2000 సంవత్సరంలో వరదలు సంభవించి, నగరంలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. నగరంలో మున్ముందు ఆ స్థాయిలో వరదలు రాకుండా చేపట్టాల్సిన చర్యల కోసం అప్పటి సర్కారు కిర్లోస్కర్ సంస్థచే సర్వే చేయించిన సంగతి తెల్సిందే. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీహెచ్) పరిధిలోనే 1908, 2000 సంవత్సరాల్లో భారీ వరదలతో నగరమంతా అతలాకుతలమైన సంఘటనలు ఉన్నాయి. ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారిన తర్వాత 2012, 2016, 2020లో భారీ వర్షాలు, వరదలతో నగరమంతా నీటమునిగినప్పుడల్లా వరదల నివారణను ప్రస్తావించే జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆ తర్వాత వయోస్ సర్వే కూడా నిర్వహించగా, వర్షాకాలం ప్రాణ నష్టం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై జెఎన్టీయూసీ ప్రొఫెసర్ పాండురంగారావు నిర్వహించిన సర్వే ప్రకారం వర్షాకాలానికి ముందే శిథిల భవనాలను గుర్తించారు.

స్టాటజిక్ నాలా డెవపల్‌మెంట్ ప్లాన్

వాటిని పటిష్ట పర్చే చర్యలు చేపట్టడం, అందుకు అనుకూలంగా లేని వాటిని గుర్తించి నేలమట్టం చేసే చర్యలను జీహెచ్ఎంసీ అడపాదడపాగా అమలు చేస్తున్నది. ఇప్పుడు సర్కార్ జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించాలన్న నిర్ణయం తీసుకోవడంతో హైడ్రా నిర్వహించనున్న హైడ్రోలాజికల్ సర్వే నాలుగో సర్వే. ఔటర్ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు 27మున్సిపాటీలు ఉన్నాయి. ఈ మొత్తం పరిధి సుమారు 2వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే స్టాటజిక్ నాలా డెవపల్‌మెంట్ ప్లాన్(ఎస్ఎన్డీపీ)లో భాగంగానే వరద నివారణ చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలను మిగిలిన 27 మున్సిపాల్టీల్లో ఏ రకంగా చేపట్టాలి అన్న అంశంపై హైడ్రా ఈ సర్వేలో భాగంగా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

Also Read: Tandur Sub-Registrar office: అనధికార లే అవుట్లకు రిజిస్ట్రేషన్.. అక్రమం వెనుక ఉన్నది ఎదరు?

 

 

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!