HCA 200 Cr Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అక్రమాల కేసులో సీఐడీ స్పీడ్పెంచింది. జగన్మోహన రావు(Jaganmohan Rao) అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఖర్చయిన రూ.200 కోట్ల అంశంపై దృష్టి సారించింది. ఈ డబ్బును దేని కోసం ఖర్చు చేశారన్నది నిర్ధారించుకోవటానికి మరోసారి ఫోరెన్సిక్ఆడిట్ జరిపించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో జగన్మోహన్(Jaganmohan Rao) అవినీతి లీలలకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Bhatti Vikramarka: రైతన్నలకు గుడ్ న్యూస్.. రూ.16,691 కోట్ల సబ్సిడీతో ఉచిత కరెంటు
మాజీ మంత్రి కృష్ణాయాదవ్(Krishna Yadav) సంతకాన్ని ఫోర్జరీ చేయటం ద్వారా ఆయనకు చెందిన గౌలిపురా శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌లో సభ్యత్వం ఉన్నట్టుగా పత్రాలు సృష్టించిన జగన్మోహన్రావు(Jaganmohan Rao) 2023, అక్టోబర్‌లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంట్లో జగన్మోహన్ (Jaganmohan Rao)తన సమీప ప్రత్యర్థి అమర్‌నాథ్‌పై ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఆ తరువాత అక్రమాలకు తెర లేపారు. జగన్మోహన్అధ్యక్షునిగా వచ్చిన తరువాత హెచ్‌సీఏలో భారీగా నిధుల గోల్ మాల్ జరిగినట్టుగా తెలంగాణ క్రికెట్ సంఘం కార్యదర్శి గురవారెడ్డి ఇటీవల ఫిర్యాదు చేయగా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.
20 నెలల్లోనే..
జగన్మోహన్(Jaganmohan Rao)హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఎన్నికై 20 నెలలు కావస్తుండగా ఈ మధ్య కాలంలో బీసీసీఐ నుంచి రూ.240 కోట్ల నిధులు మంజూరైనట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. అయితే, ప్రస్తుతం హెచ్‌సీఏ ఖాతాలో కేవలం రూ.40కోట్లు మాత్రమే ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే 20 నెలల్లో రూ.200 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేశారు? అన్నది లెక్క తేల్చటానికే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు.
సీఐడీ దర్యాప్తులో వెల్లడి
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే జగన్మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కార్యవర్గంలో ఉన్న కొందరు నకిలీ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలను సొంతానికి మళ్లించుకున్నట్టుగా ఇప్పటికే సీఐడీ(Cid) దర్యాప్తులో వెల్లడి కావటమే. క్రికెట్ బాళ్లు, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాలు ఇలా కొన్న ప్రతీ వస్తువుకు మార్కెట్ రేటు కంటే రెండు, మూడు రెట్ల ఎక్కువ మొత్తానికి బిల్లులు సృష్టించి స్వాహా చేసినట్టుగా నిర్ధారణ అయ్యాయి. వీటికి సంబంధించి తమకు ఇష్టమున్న వారికి కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి క్విడ్ప్రో కో రూపంలో పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకున్నట్టుగా స్పష్టమైంది. ఇక, ఆయా జిల్లాల క్రికెట్ అసోసియేషన్ల(Cricket associationsకు సమ్మర్క్యాంపులు నిర్వహించటానికి నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం కాగితాలపై మాత్రమే ఇచ్చినట్టుగా చూపించి ఆ డబ్బును కూడా దిగమింగినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తే జగన్మోహన్రావు అవినీతి బాగోతానికి సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెల్లడి కాగలవని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
Also Read: Supreme Court: వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ