Fake Doctor: ఫేక్ సర్టిఫికెట్, ఫోర్జరీ పేరుతో మదీనాగూడలోని అంకురా హాస్పిటల్ లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ అంకుర ఆస్పత్రి లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా భరత్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్స్ తో అంకుర ఆస్పత్రిలో చేరి భరత్ కుమార్ విధులు నిర్వహిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలింది. అంకుర హాస్పిటల్ లో పిడియాట్రిక్ డాక్టర్ గా, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా భరత్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు.
Also read: Gopi Sundar: ‘కొరగజ్జ’తో ప్రయోగం చేశా.. ఇంతకీ ‘కొరగజ్జ’ అంటే ఏంటో తెలుసా?
ఈ విషయం పై అధికారులు గత నెల 25 నా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భరత్ కుమార్ ఉక్రెన్ లో పిడియాట్రీషన్ గా పీజీ పూర్తి చేసి తెలంగాణాలో మెడికల్ కౌన్సిల్ సంబంధించి పరీక్ష లో పాస్ అవకుండా తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. డాక్టర్ బేరం భరత్ కుమార్ రిజిస్టర్ నంబర్ తో తప్పుడు పత్రాలు సృష్టించి అంకురా ఆస్పత్రిలో పిల్లల డాక్టర్ గా విధులో చేరినట్లు విచారణలో తెలింది. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చేశాడా? లేక ఈ సర్టిఫికెట్ కూడా తప్పుగా సృష్టించాడా! అన్న దానిపై విచారణ చేస్తున్నామని మియాపూర్ సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.