BMS Telangana: భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది శ్రమ జీవుల, కార్మికుల సంఘటన అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. తెలంగాణ ప్రాంతంలో బీఎంస్(BMS) రాష్ట్ర కార్యాలయాన్ని పున: ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన గురువారం హాజరయ్యారు. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యాలయ నూతన ప్రారంభోత్సవం విశ్వకర్మ సేవా సమితి సంయుక్తాధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేద పండితులచే హోమం కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా దత్తాత్రేయ(Dhathathreya)హోసబళే మాట్లాడుతూ కార్మిక రంగంలో బీఎంఎస్ ప్రథమ స్థానానికి చేరుకుందని, కార్యాలయం లేకున్నా, ఆ స్థాయికి చేరుకున్నామన్నారు.
బీఎంఎస్ కోసం తపస్సు చేశా..
బీఎంఎస్ కార్యకర్తలు దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమే పనిచేస్తున్నారని, వారి మనసంతా వీటిపైనే లగ్నమై వుంటుందన్నారు. త్యాగం, తపస్సు, బలిదానమే బీఎంఎస్ కి చిహ్నమని హోసబళే గుర్తు చేశారు. బీఎంఎస్ కోసం చాలా మంది సర్వస్వాన్నీ అర్పించాలని ఆయన గుర్తు చేసుకున్నారు. సంఘటన కోసం, బీఎంఎస్ కోసం తపస్సు చేశారని, అంతకంటే ఓ అడుగు ముందుకు వేసి, అవసరం అనుకుంటే బలిదానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బలిదానం కోసం ఎన్నడూ వెనకడుగు వేయలేదని, ఈ గుణాలన్నింటికీ సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా బీఎంఎస్ లో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి గుణగణాల వల్లే 70 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా బీఎంఎస్ బృహత్ సంఘటనా శక్తిగా నిలబడి, అత్యంత పెద్ద శక్తిగా రూపాంతరం చెందిందన్నారు.
Also Read: Gajwel – BRS: పార్టీ ఫండ్ చిచ్చు.. గజ్వేల్ బీఆర్ఎస్‌లో లుకలుకలు!.. ఎక్కడివరకు దారితీసిందంటే?
వీటి ఆధారంగా ఉద్యమాలు
అయితే ఇదంతా కేవలం కార్యాలయ భవనం వల్లే కాలేదని, త్యాగం, తపస్సు, దృష్టి కోణం, పరిశ్రమ వల్ల, దేశం కోసం పనిచేయాలన్న దృష్టి కోణంతోనే ఇంత పెద్ద పని జరిగిందన్నారు. ఇలాంటి సైద్ధాంతిక భూమిక వల్ల, పరిశ్రమ వల్లే బీఎంఎస్(BMS) ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలబడిందని వివరించారు. భారతీయ మూలాల ఆధారంగా బీఎంఎస్ సమాజం ముందు ఉంచిందని, దీని కోసమే సంఘటనను నిర్మించిందని, కార్యకర్తలకు శిక్షణను కూడా ఇచ్చిందని, వీటి ఆధారంగా ఉద్యమాలు కూడా చేసిందన్నారు. అలాగే ఈ సైద్ధాంతిక భూమికపై కలిసొచ్చే వారితో ఓ జాబితా కూడా రూపొందించిందని, ప్రపంచంలో బీఎంఎస్ గురించి కార్మికులు, శ్రామికులు, సాధారణ ప్రజలు వినడానికి ఉత్సుకతను చూపుతారని ఆయన వివరించారు.
ప్రపంచ వేదికలపై బీఎంఎస్..
బీఎంఎస్(BMS) వ్యవస్థాపకులు దత్తోపంథ్ ఠెంగ్డే(Dattoppanth Thengde) చైనాలో పర్యటించి, అక్కడ రేడియోలో ప్రసంగించారని, అక్కడి కరుడుగట్టిన కమ్యూనిస్టులు కూడా మంత్ర ముగ్ధులయ్యారని, బీఎంఎస్ ఇంత పటిష్ఠంగా, వేగంగా ఎలా సంఘటనాత్మక రూపం తీసుకుందో చెప్పాలని అభ్యర్థించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచ వేదికలపై బీఎంఎస్ సైద్ధాంతికతను, ఆలోచనలను కొనసాగుతున్నాయన్నారు. 1989 నుంచి 2002 లో అత్యధిక సభ్యత్వాలు చేసిన రాష్ట్రం తెలుగు రాష్ట్రమని గుర్తు చేశారు. బీఎంఎస్ అనేది అత్యంత పెద్ద ట్రేడ్ యూనియన్ అని, ఇందులో 5,836 యూనియన్లు బీఎంఎస్ తో కలిసి నడుస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి(Kishan Redddy), మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dhathreya), స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ రామచందర్ రావు(Ramchendhar Rao) తదితరులు పాల్గోన్నారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఈ లైనప్ చూస్తే ప్యాన్స్ ఫ్యాన్స్‌కు పండగే.. గ్లోబల్ రేంజ్ ర్యాంపేజ్..

