Begumpet Railway Station: ఈ రైల్వే స్టేషన్ చూసేందుకు లుక్ అదుర్స్ అనేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ను తలదన్నేలా ఆ రైల్వే స్టేషన్ ముస్తాబవుతోంది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అనే తరహాలో ఈ రైల్వే స్టేషన్ ను చూసి ప్రయాణికులు తెగ మురిసిపోతున్నారు. ఔను, ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో అనుకుంటే పొరపాటే. మనహైదరాబాద్ పరిధిలోని బేగంపేట రైల్వేస్టేషన్.
బేగంపేట రైల్వే స్టేషన్ కు నిత్యం ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. ఎక్కువగా ఉద్యోగస్తులు ఈ రైల్వేస్టేషన్ గుండా ప్రయాణాలు సాగిస్తుంటారు. అంతేకాకుండా పక్కనే విమానాశ్రయం ఉండడంతో ఈ రైల్వే స్టేషన్ ప్రాధాన్యత పెరిగింది. అందుకే కాబోలు రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం చర్యలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్స్ అభివృద్ధికి చర్యలు తీసుకున్న కేంద్రం, బేగంపేట రైల్వే స్టేషన్ ను రోల్ మోడల్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంది.
ఇటీవల రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 38 కోట్లను బడ్జెట్ ద్వారా కేటాయించారు. ఈ నిధుల ద్వారా గత కొన్ని నెలల క్రితం పనులను ప్రారంభించారు. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు చకచకా సాగుతున్నాయి. కొత్త ప్రాంగణం, లిఫ్ట్ సౌకర్యం, ఎస్కలేటర్, అప్ గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్ ఇలా అన్ని కొత్త హంగులు బేగంపేట రైల్వే స్టేషన్ కు సమకూరనున్నాయి.
ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం అమితంగా ఆకట్టుకుంటుండగా, ప్రయాణికులు సెల్ఫీలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తాము రోజూ రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ ఈ స్థాయిలో అభివృద్ది చెందుతుందని అనుకోలేదని, కేంద్రానికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు.
Also Read: Central Panchayati Awards: కేంద్ర పంచాయతీ అవార్డ్స్.. రాష్ట్రం నుండి ఆ గ్రామాలకు అవకాశం!
తాజాగా బేగంపేట రైల్వే స్టేషన్ ఫోటోలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్స్ సూపర్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా పాత ఫోటోలను షేర్ చేసి, అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అంటూ కిషన్ రెడ్డి ఫోటోలు విడుదల చేశారు. అయితే హైదరాబాద్ నగర అందాన్ని పెంచేవిధంగా బేగంపేట రైల్వే స్టేషన్ కొత్త హంగులు రూపుదిద్దుకుందని నగరవాసులు అంటున్నారు. మీకు బేగంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉందా? అయితే ఓ లుక్కేసి రండి.
𝐁𝐞𝐠𝐮𝐦𝐩𝐞𝐭 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧, Secunderabad
Redevelopment is nearing completion under the Amrit Bharat Station Scheme of @narendramodi Government.
Budget: ₹38 Crores.Status update: 90% complete
The station is getting a modern facelift with:
– Improved… pic.twitter.com/HAQxNTzWXs— G Kishan Reddy (@kishanreddybjp) April 16, 2025