ACB Rides: ఎంపీడీవో కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకొని ఓ భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత రెండున్నరా లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే లక్ష యాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని మిగతా బ్యాలెన్స్ లక్ష రూపాయలు బుధవారం నాడు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం డిమాండ్..
రంగారెడ్డి(Rangareddy) జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామ వ్యవసాయ క్షేత్రంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోవడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య(Chennaiah), ఎంపీఓ తేజ్ సింగ్(Tej Singh), ఎంపీడీవో సుమతి(Sumathi), ముగ్గురి సమక్షంలో మొట్ట మొదట ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. రెండున్నర లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే లక్షయాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మిగతా లక్ష రూపాయలు బుధవారం నాడు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్(ACB DSP Anand Kumar) ఆధ్వర్యంలో అధికారులు నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ
శంషాబాద్, నందిగామ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ
రూ.1.5 లక్షలు లంచం ఇచ్చిన సదరు వ్యక్తి
ఈరోజు… pic.twitter.com/KtyOfOfOeE
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026
Also Read: Badangpet Municipality: బడంగ్‌పేట్ మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో పోస్టర్ల కలకలం

