మేడ్చల్, స్వేచ్ఛ: TDP Formation Day: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నాగారం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు కొండా జంగారెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఎన్టీఆర్ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలు అందించిన గొప్ప నాయకుడని తెలిపారు.
Also Read : TG Govt on Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త కొలువులకు వేళాయేరా?
ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయిన మహా నేతగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్,టీడీపీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి సుంకరి వెంకటేష్,ఐటీడీపి అధ్యక్షులు హరికృష్ణ, కంటెస్టెడ్ కౌన్సిలర్ కొండా సుజాత,కంటెస్టెడ్ కౌన్సిలర్ ఆశాబిందు, ఉమాశంకర్ గౌడ్, టీడీపీ నాయకులు కోటేశ్వరరావు, ఆంజనేయులు, ఉదిష్ణ, బ్రహ్మం చౌదరి, అంజిరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు