Secunderabad Station: సెలవులు దొరికితే చాలు.. చాలా మంది ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని సొంతూళ్ళకు వెళ్తారు. వారిలో హైద్రాబాద్ నుంచి వెళ్లే వాళ్లే ఎక్కువ ఉంటారు. అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఆరు ప్లాట్ ఫామ్స్ తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్లు రైల్వే అధికారులు వెళ్లడించారు. అలాగే, వచ్చే 115 రోజుల పాటు 120 రైళ్లను కొత్త స్టేషన్ల నుంచి నడపనున్నారు. చర్లపల్లి టెర్మినల్, నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్లకు దారి మళ్లించనున్నారు.
Also Read: SI Sudhakar Yadav: జగన్ కు గోరంట్ల మాధవ్ స్టైల్ వార్నింగ్ ఇచ్చిన ఎస్సై.. మనుషులమేనంటూ..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పునర్నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నిర్మాణ పనులు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లు కేటాయించింది. పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చేసి, అత్యాధునిక రైల్వే స్టేషన్ ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. అయితే, ఈ నిర్మాణ పనుల నిమిత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆరు ఫ్లాట్ ఫామ్స్ ను మూసివేశారు.
Also Read: Mujra Party: ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే?
నేటి నుంచి కాచిగూడ నుంచి తుంగభద్రత ఎక్స్ ప్రెస్..
సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు వెళ్లే తుంగభద్ర ఎక్స్ ప్రెస్ ను నేటి నుంచి మే 10వ తేదీ వరకు కాచిగూడ స్టేషన్ నుంచి నడపనున్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటి నుంచి రోజూ ఉదయం 07.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి మలక్ పేట, ఫటక్ నూమా, బుద్వేల్ మీదుగా కర్నూలుకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న నిర్మాణ పనులు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
Also Read: SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!