Lokesh Department
ఆంధ్రప్రదేశ్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Nara Lokesh: విద్యాశాఖలో ఇన్ని తప్పులా.. మంత్రి లోకేష్‌కు ఏమైంది!?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) విద్యాశాఖ ఉందా..? లేదా..? ఒకవేళ ఉంటే ఏం చేస్తున్నట్లు..? విద్యాశాఖ మంత్రిగా ఉన్న యువనేత నారా లోకేష్ ఏం చేస్తున్నారు? అసలు ఈ శాఖ కోసం సమయం కేటాయిస్తున్నారా? పదే పదే అచ్చు తప్పులన్నీ విద్యాశాఖలోనే ఎందుకు జరుగుతున్నాయి..? ఒకటా రెండా ఇన్ని తప్పులు జరుగుతుంటే ఎందుకీ మౌనం? విద్యాశాఖ ఎటుపోతోంది? సీరియస్‌గా, సిన్సియర్‌గా తీసుకున్నానని పదే పదే సభలు, సమావేశాలు, మీడియా మీట్‌లలో విద్యాశాఖ గురించి చెప్పే లోకేష్.. అవన్నీ ఆచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? విద్యాశాఖ మంత్రిగా చినబాబు అట్టర్ ప్లాప్ అయ్యారా? పాస్ అయ్యారా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం..


Read Also- Kavitha And Sharmila: ఓరి బాబోయ్.. కవిత, వైఎస్ షర్మిల ఇలా సింక్ అవుతున్నారేంటి?

అసలేం జరుగుతోంది?
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ లోకేష్ తన మార్క్ వేసినట్లు దాఖలాలు భూతద్ధం పెట్టి వెతికినా కనిపించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా నిన్న, మొన్న జరిగిన సంఘటనలతో చెబుతున్న మాటలు కాదు.. మొదట్నుంచీ పరిస్థితి ఇలాగే ఉన్నది. విద్యార్థులకు ఇచ్చే ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్, మే నెలలో అమలు చేస్తామని అటు లోకేష్.. ఇటు సీఎం చంద్రబాబు ఎన్ని సార్లు చెప్పారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సీన్ కట్ చేస్తే ఈ రెండు నెలలు గడిచిపోయాయ్.. అది కాస్త వాయిదా పడి జూన్ దాకా వచ్చింది. ఇప్పుడేమో వచ్చే విద్యా సంవత్సరం అని చెబుతున్నారు. పోనీ యూజీ విద్యార్థులకు అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) ఇచ్చారా? అంటే అదీ లేదు. మెడికల్ కోర్సులు (ఎంబీబీఎస్, పీజీ) చదివే విద్యార్థులకు అయినా కనీసం స్టైఫండ్ అయినా ఇచ్చారా? అబ్బే అస్సలు లేదు. ఒకటో తరగతి నుంచి 10 వరకు సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ కూడా లేకపోవడం గమనార్హం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎలాగో నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పుడేమో పదో తరగతి మూల్యాంకనంలో రోజురోజుకూ ఊహించని స్థాయిలో అవకతవకలు బయపడుతున్న పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏపీలో విద్యాశాఖ ఉన్నదా? లేదా? ఇంత జరుగుతున్నా మంత్రి లోకేష్ ఏమైపోయారు? అని సాటి సామాన్యుడికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.


AP Tenth

‘పది’లో ఇన్ని పొరబాట్లా?
పదో తరగతి మూల్యాంకనంలో లెక్కలేనన్ని లోపాలు వెలుగుచూశాయి. పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో (Valuation) మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన లోపాలు ఈ ఏడాది రావడం గమనార్హం. పది కాదు, ఇరవై కాదు ఏకంగా రికార్డు స్థాయిలో 66,363 దరఖాస్తులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వచ్చాయంటే విద్యాశాఖ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారినట్లుగా విద్యాశాఖ గుర్తించింది. టోటలింగ్ లోపాలు, మార్కులు ఓంఎంఆర్ (OMR) షీట్‌లో సరిగ్గా నమోదు చేయకపోవడం, కొన్ని సమాధానాలను అసలు గుర్తించకపోవడం వంటి తప్పులు గుర్తించారు. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్‌ అయ్యింది. అదేదో అంటారో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనే సామెతలాగా.. ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ తర్వాత తీసుకున్నారు. బాధ్యులైన ఐదుగురు మూల్యాంకన అధికారులు.. 5 మంది వాల్యుయేటర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్‌ చేసింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ వైఫల్యం వల్లే విద్యార్థులు క్షోభ అనుభవిస్తున్నారని, ఈ లోపాలతో ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను కూడా గుర్తు చేస్తూ సామాన్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు ముగియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖకు ప్రతిపాదించింది.

ఇంత దారుణమా.. దృష్టిపెట్టండి సారూ?
రెండ్రోజుల వ్యవధిలోనే ఊహించని రీతిలో అవకతవకలు బయటపడుతున్న పరిస్థితి. ఒక్క ఉదాహరణ చూస్తే.. నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని ఈస్ట్ వుడ్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బొర్రా శిశింద్రా రెడ్డి అనే విద్యార్థి ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవగా, రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రీవాల్యుయేషన్ అనంతరం గణితంలో 70 మార్కులు పెరగగా, ఓఎంఆర్ షీట్‌లో మాత్రం గణితంలో 78 మార్కులు ఉండడంతో మరొకసారి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఫలితాల్లో ఒకసారి తప్పు జరిగితే పొరపాటు అనుకోవచ్చు, కానీ రీవాల్యుయేషన్‌లో (Revaluation) కూడా తప్పు జరగడం ఏంటి? అని తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలే ఉన్నాయి. ఇలా ఫలితాల్లో జరిగిన తప్పులకు విద్యార్థులకు తిప్పలు తప్పట్లేదు. మరోవైపు లోకేష్ ఒత్తిడి కారణంగానే తప్పులు దొర్లాయనే విమర్శలూ లేకపోలేదు. వేలాది మంది భవిష్యత్తును కూటమి ప్రభుత్వం ఛిద్రం చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకూ జరగలేదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, విద్యాశాఖ ఎంతలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

Minister Lokesh

Read Also- YSRCP: ‘కుప్పం’ సాక్షిగా నారా లోకేష్ మోసం బ‌ట్టబ‌య‌లు.. పెద్ద కథే ఉందిగా..

ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో..?
2025 ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ పేపర్‌లో ముద్రణ లోపాలు చోటుచేసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.3,500 కోట్లు పేరుకుపోయాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక పరీక్షలు రాయలేకపోయారు కూడా. అయితే ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని, బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది కానీ ఇంతవరకూ ఆ ఊసే లేకపోవడం గమనార్హం. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీల్లోనూ ఎనలేని సమస్యలు నెలకొన్నాయి. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల జాబితాలో కేటగిరీల వారీగా చాలనే లోపాలు ఉన్నాయి. మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పట్నుంచో విద్యాశాఖను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే.. పాఠ్యపుస్తకాల్లోనూ తప్పులు దొర్లాయి. పలుచోట్ల పాఠశాలల విలీనం, మూసివేతతో వివాదాలు నెలకొన్నాయి. విద్యా బోధనలో నాణ్యతా లోపాలు కూడా ఉన్నాయని మీడియా, సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు, ఫొటోలు దర్శనమిచ్చాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, మరియు ఆధునిక బోధనా పద్ధతులను అమలు చేయడంలో జాప్యం వంటివి దీనికి కారణాలని చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు.. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులతో పోటీ పడటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత ఒక పెద్ద సమస్యగా మారింది. సరైన తరగతి గదులు, ల్యాబ్స్, గ్రంథాలయాలు, మరుగుదొడ్లు, తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటివి లేకపోవడం విద్యార్థుల విద్యా వాతావరణంపై ప్రభావం చూపుతోంది. మరీ ముఖ్యంగా గ్రూప్-2 మెయిన్స్ విషయంలో ఎంత డ్రామా నెలకొన్నదే అందరికీ తెలిసే ఉంటుంది.

AP DSC

వామ్మో.. డీఎస్సీ.. అన్నీ అర్ధరాత్రే..!
అదిగో అధికారంలోకి వస్తాం.. ఇదిగో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేస్తామని కూటమి పార్టీల పెద్దలు ప్రగల్భాలు పలికిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చిన ఏడు ఎనిమిది నెలలకు కానీ ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఆ తర్వాత వచ్చినా ఎన్నో వివాదాల నడుమ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికీ న్యాయపరమైన చిక్కులు, ఇతర కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యం అవుతూనే వస్తున్నది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్నీ అర్ధరాత్రి పనులే చోటుచేసుకున్నాయి. డీఎస్సీకి సంబంధించి మాక్ టెస్టులు అర్ధరాత్రి సమయంలోనే అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత హాల్ టికెట్లు కూడా అర్ధరాత్రి అన్నారు కానీ, తెల్లవార్లు డీఎస్సీ అభ్యర్థులు https://apdsc.apcfss.in/ క్లిక్ చేస్తూనే ఉండిపోయారు. తీరా చూస్తే శనివారం మధ్యాహ్నంకు కొన్ని కొన్ని హాల్ టికెట్లు వచ్చాయి. అభ్యర్థులకు ఇంకా తిప్పలు తప్పట్లేదు. ఆఖరికి ఎంతలా అంటే మాక్ టెస్టులు, హాల్ టికెట్లు అర్ధరాత్రే అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. కొంపదీసి రేపు పొద్దున్న డీఎస్సీ పరీక్షలు కూడా అర్ధరాత్రి పెడతారా? అంటూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు విద్యాశాఖ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లోపాలన్నీ విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని తప్పక సూచిస్తున్నాయి. విద్యాశాఖ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. నారా లోకేష్ కూడా.. ఎంతసేపూ రెడ్ బుక్కు అదీ.. ఇదీ అని చెప్పుకోవడం కాకుండా శాఖలపై దృష్టిపెడితే మంచిదని సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు.. రాజకీయ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.

 

Read Also- Nara Lokesh: నారా లోకేష్ నోట అల్లు అర్జున్ డైలాగ్.. మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు