Bhumana Abhinay On Lokesh
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YSRCP: ‘కుప్పం’ సాక్షిగా నారా లోకేష్ మోసం బ‌ట్టబ‌య‌లు.. పెద్ద కథే ఉందిగా..

YSRCP: వైసీపీ యువనేత, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్త భూమన అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy).. కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు. మొన్న కరెంట్ ఛార్జీలపై, నిన్న 24/7 మద్యం దుకాణాల తెరవడంపై, ఇవాళ ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కూటమి సర్కార్‌ను ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. మరీ ముఖ్యంగా ఆ మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో ఏ రేంజిలో హడావుడి జరిగిందో, కార్పొరేటర్లను భూమన అభినయ్ ఎలా కాపాడుకున్నారో? కేసులు, కోర్టుల మెట్లెక్కి నానా యాగీ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా మరో ఇష్యూతో భూమన హల్‌చల్ చేశారు. ఆ వ్యవహారం మరేదో కాదు.. నాడు నారా లోకేష్ (Nara Lokesh) ఏ విషయంలో అయితే వైసీపీని ప్రశ్నించి హడావుడి చేశారో.. నేడు అదే విషయంలో ప్రశ్నిస్తూ మీడియా ముందుకొచ్చారు. ఇంతకీ ఏమిటా ఇష్యూ అనేది ఇప్పుడు చూద్దాం..

Read Also- YSRCP: ఆ ఒక్క పని చేసుంటే వైసీపీ గెలిచేదా..? ఘోర తప్పిదానికి కారణమెవరు?

తెల్లవారుజామునే..
అధికారం దక్కించుకోవడానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ అబద్ధాలు చెప్పారంటూ.. కుప్పం సాక్షిగా వైసీపీ యంగ్ లీడర్ భూమ‌న అభిన‌య్‌రెడ్డి బ‌ట్టబ‌య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో పెట్రో ధ‌ర‌ల (Petrol Prices) వ్యత్యాసాల‌ను అభినయ్ స్వయంగా ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సోష‌ల్ మీడియా ద్వారా వాస్తవాల‌ను వెలుగులోకి తెచ్చి ‘ఇదిగో పెట్రోల్‌పై లోకేష్ చేసిన మోసం’ అంటూ టీడీపీ కూట‌మి ప్రభుత్వ కుట్రల‌ను ఎండ‌గ‌ట్టారు. బుధవారం తెల్లవారుజామునే క‌ర్ణాట‌క బార్డర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో పెట్రోల్ ధ‌ర‌లు తెలుసుకొని, ఆ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో భూమ‌న అభిన‌య్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా తన కారుకు డీజిల్ కొట్టించి మరీ ధరలు చూపించారు. అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ చెప్పిన అబద్ధాలు అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు.

Bhumana Abhinay

నాడు.. నేడు!
ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే కారణమని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌కి వెళ్లిన లోకేష్, బంక్‌ల దగ్గర నిలబడి, దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని ‘ఇది వైఎస్ జగన్ (YS Jagan) విధానాల వైఫల్యం’ అంటూ అప్పట్లో లోకేష్ నానాయాగీ చేశారని ఆరోపించారు. అంతే కాకుండా ‘మేం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం కానీ పెంచ’మ‌ని లోకేష్ హామీ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ కూట‌మి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గించ‌క‌పోగా, పెంచుతూనే ఉన్నారని అభినయ్ ఆరోపించారు. దేశం మొత్తమ్మీద ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధ‌ర‌లు ఉన్నాయని, ఒక్క పైసా కూడా పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించ‌లేదని భూమా అభినయ్ విమర్శలు గుప్పించారు.

Bhumana On Petrol Prices

Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్ నేనే.. కట్టప్ప ఇలా షాకిచ్చాడేంటి?

అబద్ధాలు చెప్పొద్దు..
పెట్రోల బంకులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అభినయ్.. ఓటు కోసం అబ‌ద్ధాలు చెప్పొద్దంటూ చంద్రబాబు, లోకేష్‌ల‌కు సూచించారు. ఓట్ల కోసం అమ‌లుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వ‌చ్చాక మోసం చేయ‌డం చంద్రబాబుకు అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు. ఓటు వేయించుకూనే వరకు వాగ్దానాలు, ఆ తర్వాత పూర్తిగా మర్చిపోవడం, ఇది ప్రజాస్వామ్యంలో బాధ్యతా రాహిత్యమ‌ని ఆయన విమ‌ర్శించారు. ఓటు కోసం అబద్ధాలు చెప్పొద్దని, ప్రజలను మోసం చేయొద్దని అభిన‌య్‌రెడ్డి ఈ సందర్భంగా హిత‌వు ప‌లికారు. దీనిపై నాడు అధికారంలో లేనప్పుడు హడావుడి చేసిన లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

Petrol Prices

Read Also- Tollywood: దిల్‌రాజుపై బాంబు పేల్చిన జనసేన బహిష్కృత నేత.. మొత్తం బండారం బయటపెట్టేశారుగా!

 

అప్పట్లో నారా లోకేష్ ట్వీట్..

 

 

ఇప్పుడు జరుగుతున్నది ఇదీ..

Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్ నేనే.. కట్టప్ప ఇలా షాకిచ్చాడేంటి?

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు