Raa Raja Movie Team
ఎంటర్‌టైన్మెంట్

Raa Raja: ఫేస్ కనిపించకుండా.. ప్రయోగం వర్కవుట్ అవుతుందా?

Raa Raja: ఫేస్‌లు కనిపించకుండా సినిమా అంటే, దర్శకనిర్మాతలు ఎంతగా సాహసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ నేటి ప్రేక్షకులు ఇలాంటి వైవిధ్యతని బాగా ఇష్టపడుతున్నారు. రొటీన్ చిత్రాలను అస్సలు ఇష్టం పడటం లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే, ఇలాంటి సాహసాలు, ప్రయోగాలు దర్శకనిర్మాతలకు తప్పనిసరి. ఆర్టిస్ట్‌ల ఫేస్ చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ‘రా రాజా’ అని అంటున్నారు మేకర్స్. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి శివ ప్రసాద్ రూపొందించారు. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారని ఊహిస్తోందీ చిత్రబృందం. మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది.

Also Read- Chhaava Telugu Trailer: గర్జనకు లొంగకపోతే పంజా వేట తప్పదు

ఆ పాయింటే కథగా

ఈ కార్యక్రమంలో దర్శకుడు బి శివ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. ఆ సమయంలో నా మైండ్‌లోకి వచ్చిన ఓ పాయింట్‌ ఎగ్జయిట్‌కి గురించి చేసింది. ఆ పాయింట్‌నే కథగా మార్చాను. ఈ కథతోనే అనుకోకుండా దర్శకుడిగానూ మారిపోయాను. ‘రా రాజా’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. చాలా బాగా తీశారంటూ మా టీమ్‌ని అభినందించారు. మార్చి 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను కూడా అలరించి మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.

నిర్మాతగా అనుకున్నా కానీ..

‘రా రాజా’ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం లభించింది. దర్శకుడు శివ ప్రసాద్ నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమా కథ నాకు చెబుతున్నప్పుడు నిర్మాతగా చెబుతున్నారని అనుకున్నాను కానీ ఆయనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని తర్వాత తెలిసింది. కథ చాలా బాగుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంగేజ్ చేస్తుంది. మీడియాతో పాటు ప్రేక్షకులందరూ ఈ సినిమాకు సపోర్ట్ అందించాలని కోరారు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్ష్ చెప్పారు కెమెరామ్యాన్ రాహుల్ శ్రీ వాత్సవ్. కాగా, ఈ సినిమాకు బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!

Actress: ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలతో హీరోయిన్ ఎఫైర్?

Just In

01

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..