Rashmika Mandanna
ఎంటర్‌టైన్మెంట్

Rashmika Mandanna: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!

Rashmika Mandanna: కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన రష్మికా మందన్నాపై అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మండిపడ్డారు. త్వరలోనే ఆమెకు గుణపాఠం చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు. కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’తో రష్మికా మందన్నా తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమ అనంతరం ఇద్దరూ నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి వరకు వెళ్లారు. కానీ, చివరి నిమిషంలో ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇదిలా ఉంటే, ఆ ఘటన తర్వాత ఆమె కన్నడ సినీ ఇండస్ట్రీని వదిలి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు చేరింది. కన్నడ సినీ ఇండస్ట్రీని ఆమె పట్టించుకోవడమే మానేసింది. దీంతో రష్మికపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ మధ్య ‘కాంతార’ సినిమా సమయంలో స్పందించలేదంటూ భారీ స్థాయిలో ఆమెపై ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు ఏకంగా కర్ణాటక నుంచి రష్మికకు హెచ్చరికలే వస్తున్నాయి.

Also Read- Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్

రష్మికకు గుణపాఠం చెబుతాం
బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రష్మికా మందన్నాను ఆహ్వానించగా ఆమె రానని, తనకు అంత సమయం లేదని చెప్పిందంటూ కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ (MLA Ravi Ganiga) వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుకుంటున్న రష్మికా మందన్నా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’తో కర్ణాటక రాష్ట్రంలోనే కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాలని, గతేడాది అనేక మార్లు ఆమెను సంప్రదించాము. అందుకు ఆమె రానని ఖరాఖండీగా చెప్పేసింది. కర్ణాటకకు వచ్చేంత సమయం తన దగ్గర లేదని, ప్రస్తుతం ఈ రాష్ట్రం వదిలి హైదరాబాద్‌లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చింది. అసలు కర్ణాటక ఎక్కడో కూడా తనకు తెలియదు అన్నట్లుగా మాట్లాడింది. ఏదో బిజీగా ఉండటం వల్ల అలా చెప్పిందేమో అని అనుకుని, ఆ తర్వాత ఆమెకు తెలిసిన వారిని ఆహ్వానించడానికి పంపించాం. అప్పుడు కూడా ఆమె అదే విధంగా ప్రవర్తించింది. రష్మిక పద్దతేం బాగా లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీని, కన్నడ భాషను ఆమె అగౌరవ పరుస్తున్నారు. దీనికి త్వరలోనే ఆమెకు సరైన గుణపాఠం నేర్పిస్తామంటూ మండిపడ్డారు.

ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం
ఎమ్మెల్యే రవి గనిగ మాత్రమే కాదు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా బెంగళూరులో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నటీనటులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రం‌లో జరుగుతున్న ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నటీనటులు, దర్శక నిర్మాతలు మద్దతుగా ఉండాలి. ఇలాంటి కీలక కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకారం అందించాలి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇలాంటి కార్యక్రమాలకు వారు రాకపోతే, ప్రయోజనం ఏముంటుంది? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరమని అంతా గుర్తుంచుకోవాలి. సెలబ్రిటీల తీరు మారకపోతే, వారిని ఏ విధంగా దారిలోకి తీసుకు రావాలో నాకు బాగా తెలుసు’’ అని డీకే శివకుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:
MAD Square vs Robinhood: ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ రోజే ‘మ్యాడ్ స్క్వేర్’.. నిజంగా అమావాస్యే కారణమా?

Vidya Balan: ఆ వీడియోలు నావి కావు.. డీప్ ఫేక్ బారిన విద్యాబాలన్

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?