Vijay Deverakonda
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. అందుకే రష్మికతో

Vijay Deverakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న కెరీర్ ఆరంభంలో మాత్రం పీక్ స్టార్‌డమ్‌ని చూశాడు. డెబ్యూ మూవీ పెళ్లి చూపులతోనే ప్రామిసింగ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి అనే పాత్రలో మెరిసిన విజయ్.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఆకర్షించాడు. దీంతో అర్జున్ రెడ్డి కోసం రౌడీ బాయ్‌ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ సినిమా రిజల్ట్ గురించి విజయ్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో మరో స్టార్ అవతరించాడు అని అంతా భావించారు.

నెక్స్ట్.. ‘గీత గోవిందం’ సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ దశలోనే దర్శక నిర్మాతలతో పాటు టాప్ హీరోయిన్లు విజయ్‌తో పని చేసేందుకు విపరీతమైన ఆసక్తిని చూపారు. ఈ దశలోనే డియర్ కామ్రేడ్(Dear Comrade) అనే యూనిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది బెడిసికొట్టింది. కానీ.. ఇప్పటికి ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులు ఫేవరెట్‌గా నిలిచింది. రిజల్ట్ పక్కనా పెడితే.. ఈ సినిమాలో రష్మిక మందన్న విజయ్‌తో రెండో సారి నటించింది. అయితే ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రష్మిక(Rashmika Mandanna) కాదు. అప్పటికే విజయ్‌తో పాటు స్టార్‌గా ఎదుగుతున్న సాయి పల్లవి(Sai Pallavi) నటించాల్సి ఉంది కానీ.. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉండటంతో ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది. దీంతో ఈ అవకాశం రష్మికకు దక్కింది.

Also Read: Allu Arjun X Atlee: అబ్బా మళ్ళీ తనేనా.. బన్నీ మూవీలోను అదే బాలీవుడ్ బ్యూటీ?

Sai pallavi
సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన రౌడీ

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి విజయ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల భారీ అంచనాలతో తెరకెక్కించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్'(Family Star). ఈ సినిమా రిజల్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది. అది పక్కనా పెడితే.. ఈ సినిమాలో విజయ్ సరసన ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ థాకూర్( Mrunal Thakur) నటించింది. కానీ మొదట దర్శక నిర్మాతలు సాయి పల్లవి ప్రస్తావన తీసుకొచ్చారట. కానీ.. ‘ఆ అమ్మాయి రొమాంటిక్ సీన్లలో నటించ లేదు, సినిమాలో లిప్ లాక్ కూడా ఉంది. ఆమెని అడిగి నో చెప్పించుకోవడం కంటే మనమే రిజెక్ట్ చేయడం బెటర్’ అని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడట. ఏది ఏమైనప్పటికి సాయి పల్లవి రెండు పెద్ద ప్లాప్‌ల నుంచి తప్పించుకుందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

Chhaava: ‘ఛావా’ నిజంగానే గొప్ప సినిమానా?

SKN Controversy: పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు