Allu-Arjun
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun X Atlee: అబ్బా మళ్ళీ తనేనా.. బన్నీ మూవీలోను అదే బాలీవుడ్ బ్యూటీ?

Allu Arjun X Atlee: ‘పుష్ప 2′(Pushpa 2) గ్రాండ్ సక్సెస్ తర్వాత బన్నీ(Allu Arjun) నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఆసక్తి రేకెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఇది పక్కనా పెడితే.. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో (Trivikram Srinivas) పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయననున్నాడు. అలాగే బాలీవుడ్ లెజెండ్ సంజయ్ లీల భన్సాలీ, సందీప్ రెడ్డి వంగాతో కూడా కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ‘పుష్ప’ 2 తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కాల్సిన విషయం తెలిసిందే. కానీ.. ఆ ప్రాజెక్ట్ లేట్ కానున్నట్లు సమాచారం. ఈ గ్యాప్‌లోనే అట్లీ(Atlee) బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్‌కు హ్యాండిచ్చి మరి బన్నీ బాయ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇవి చూసి కొందరు ‘అబ్బా మళ్ళీనా’ అనే ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నారు. ఇంతకు మేటర్ ఏంటంటే..

త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ కు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా(AA 22). ఈ నేపథ్యంలోనే ఎలాంటి తొందరలు పడకుండా త్రివిక్రమ్ జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకుంటున్నాడట. ఇందుకే ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా లేట్ అవుతుందట. ఈ క్రమంలోనే అట్లీ అడ్వాన్స్ అయ్యి సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఇండియన్ వైడ్ గా మోస్ట్ సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ మరోసారి మాస్ యాక్షన్ సినిమానే సినిమానే చేయనున్నట్లు సమాచారం.

ఇదంతా ఓకే గానీ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor)ని సెలెక్ట్ అయినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలుగులో ‘దేవర’ గ్రాండ్ డెబ్యూ చేసిన ఈ బ్యూటీ అందం పరంగా ఓకే కానీ.. అభినయంతో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చి బాబు ప్రాజెక్ట్ లోను పని చేస్తుంది. ఎందుకో ఏమో కానీ తెలుగు ఆడియెన్స్ అతిలోక సుందరి కూతురికి కనెక్ట్ కావడానికి ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ బన్నీ సినిమాలో, అది కూడా కమర్షియల్ సినిమాలో జాన్వీ అంటే ఆడియెన్స్.. అబ్బా మళ్ళీ తనేనా! అనే ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నారు.

తప్పు ఎవరిదీ?

అయితే జాన్వీ కి టాలెంట్ లేదా? నటిగా నిజంగానే సక్సెస్ కాలేకపోతుందా? స్టోరీ సెలెక్షన్ రావడం లేదా? అంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. మొదటి సినిమా నుంచి జాన్వీ తన ప్రాజెక్ట్స్ ను సెలెక్ట్ చేసుకున్న విధానం వెరీ వర్సటైల్, డేరింగ్, బోల్డ్ అనే చెప్పాలి. డెబ్యూనే ‘ధ‌డ‌క్’ వంటి సాలిడ్ మూవీ మధ్యలో ‘మిలి’ వంటి సర్వైవర్‌ థ్రిల్లర్‌ ఏ కాకుండా ప్రతి మూవీ డిఫరెంట్ జోనర్. మరి అతిలోక సుందరి శ్రీదేవి కూతరు వారసత్వం అంటే కేవలం అందం కాదు అంతకు మించిన అభినయం. జాన్వీ స్టోరీ సెలెక్షన్ సూపర్ కానీ.. నటిగా కొంచెం పరిపక్వత చెందితే ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్ గా అవతరించే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు డైరెక్టర్లు కూడా హీరోయిన్లను అందాల ఆరబోతకు, హీరో ఇంట్రెస్ట్ వరకు మాత్రమే రాసుకోవడం హీరోయిన్లను కాసులు రప్పిస్తున్న.. కెరీర్ లేకుండా చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

 

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?