Vijay Antony in Bhadrakaali Movie
ఎంటర్‌టైన్మెంట్

Bhadrakaali: ‘బిచ్చగాడు’ హీరో నటించిన ‘భద్రకాళి’ టీజర్ ఎలా ఉందంటే..

Bhadrakaali Teaser: విజయ్ ఆంటోని.. ఈ పేరుని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు సైతం గుర్తు పెట్టుకునేలా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని (Vijay Antony). ఆయన నటించిన చిత్రాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతుంటాయి. తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ ఆంటోని చిత్రాలను బాగా ఇష్టపడతారు. అందుకే విజయ్ ఆంటోని తను నటించే ప్రతి చిత్రాన్ని తెలుగు భాషని దృష్టిలో పెట్టుకుని మరీ చేస్తుంటారు.

డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ఎంతగానో వేచి చూస్తున్నాననే స్టేట్‌మెంట్ కూడా ఇటీవల ఆయన నుంచి వచ్చిందంటే.. టాలీవుడ్‌పై ఆయన ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రానికి ‘భద్రకాళి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర టీజర్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ టీజర్ చూస్తుంటే, ‘బిచ్చగాడు’ తర్వాత ఆ తరహా హిట్‌ని సొంతం చేసుకోలేకపోయినా విజయ్ ఆంటోని కలను ‘భద్రకాళి’ తీర్చేలానే ఉందనిపిస్తుంది. టీజర్‌ని గమనిస్తే..

Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!

‘దారి చూపడానికి వచ్చిన స్వామి.. విత్తనమై మొలకెత్తాడు’
‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్ధం, అహంకారం అంతమవును’
‘చరిత్రలో ఇంత వరకు ఇలాంటి సంభవం జరగలేదు. నేషన్‌లో ఇదే బిగ్గెస్ట్ స్కామ్‌ అవుతుంది.. రాసిపెట్టుకోండి’
‘పాలిటిక్స్‌లో ఇంట్రస్ట్ ఉంటే రంగంలోకి దిగవచ్చు. పాపులారిటి, ఇమేజ్ ముఖ్యం అనుకుంటే పోస్టర్స్ వేయించుకోవచ్చు’ వంటి డైలాగ్స్‌తో వచ్చిన ఈ టీజర్, దాదాపు ఈ సినిమా కాన్సెప్ట్‌ని రివీల్ చేసింది.

ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ అవకాశాలతో, ఒక పెద్ద స్కామ్‌ని ఇందులో చూపించబోతున్నారనేది ఈ టీజర్‌ లోని ప్రతి ఫ్రేమ్ తెలియజేస్తుంది. ఇందులో విజయ్ ఆంటోని ఏ పాత్ర చేస్తున్నారనేది క్లారిటీ ఇవ్వకుండా రెండు మూడు వేరియేషన్స్‌లో ఆయనని చూపించారు. ఫ్యామిలీ‌మ్యాన్‌లా ఒకసారి, గ్యాంగ్ స్టార్‌లా మరోసారి, ఉన్నతాధికారిలా, ఖైదీగా ఇలా విభిన్నమైన గెటప్స్‌లో విజయ్ ఇందులో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ‘కిట్టు’ అనే పేరు బాగా హైలెట్ అవుతుంది. అసలు కిట్టు అనే పర్సన్ ఎవరు? కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా చెబుతూ.. ఇది ఆరంభం మాత్రమే అంటూ టీజర్‌ని ముగించిన తీరు చూస్తుంటే.. విజయ్ ఆంటోనికి ఈసారి కచ్చితంగా హిట్ సినిమాగా ‘భద్రకాళి’ (Bhadrakaali Movie) నిలుస్తుందని ఈ టీజర్ డిసైడ్ చేస్తోంది.

విజయ్ ఆంటోని 25వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన కనిపించిన తీరు కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేస్తుంది. ఫిజిక్ పరంగా చాలా స్టైలిష్‌గా, ఇప్పటి వరకు కనిపించని న్యూ అవతార్‌లో దర్శనమిచ్చి, సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేశారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కిందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనినే సంగీతం అందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటివారు ముఖ్యం తారాగాణంగా నటించిన ఈ ‘భద్రకాళి’ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు