Tunnel: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఒక మహిళ మాతృత్వం పొందినప్పుడు.. ఆమె జీవితం పరిపూర్ణమవుతుందని అంతా అంటుంటారు. అలాంటి పరిపూర్ణ మహిళగా లావణ్య త్రిపాఠి మారారు. ప్రస్తుతం బిడ్డతో చాలా సంతోషంగా ఉన్న లావణ్య త్రిపాఠికి ‘టన్నెల్’ చిత్రంతో సక్సెస్ కొట్టి, మరింత ఆనందాన్ని ఇస్తామని అంటున్నారు ఆ చిత్ర మేకర్స్. అథర్వా మురళీ (Atharvaa Murali), లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన ‘టన్నెల్’ (Tunnel Movie) చిత్రం ఇటీవల తమిళ్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు ఆడియెన్స్ ముందుకు సెప్టెంబర్ 19న ఈ సినిమా రాబోతోంది. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చెప్పేసింది. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ. రాజు నాయక్ అందించబోతున్నారు.
Also Read- Heroine: ఒక్క సినిమాలో చేసేందుకు.. ఈ నటికి రూ. 530 కోట్ల పారితోషికం.. ఎక్కడో కాదు ఇండియాలోనే!
సెన్సార్ పూర్తి
ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ‘టన్నెల్’ తెలుగు ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాగే హీరో అథర్వా ఇలాంటి జోనర్‌లో చేసిన చిత్రాలన్నీ పెద్ద సక్సెస్ సాధించాయి. ఆ సెంటిమెంట్‌తో పాటు.. గ్రిప్పింగ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ఉంటుందనే విషయంతో ట్రైలర్‌లో అర్థమైంది. తెలుగు సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, యుబైఏ సర్టిపికేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్‌తో, ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న నిర్మాత ఏ. రాజు నాయక్ (A Raju Nayak) చాలా హ్యాపీగా ఉన్నారు.
Also Read- Mirai Movie: ‘మిరాయ్’లో మంచు మనోజ్ చేసిన పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
యాక్షన్ సీక్వెన్స్ అద్భుతం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూబైఏ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉందని, మంచి మెసెజ్‌ను కూడా ఇచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించడంతో, తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా విషయంలో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి. జస్టిన్ ప్రభాకర్ సంగీతం, శక్తి శరవణన్ ఫొటోగ్రఫీ, కలైవానన్ ఎడిటింగ్ అన్నీ కూడా హైలెట్‌గా ఉంటాయి. లావణ్య త్రిపాఠి, అథర్వాల యాక్టింగ్‌కు అంతా ఫిదా అవుతారు. సెప్టెంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ చూడాలని కోరుతున్నానన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు