Tuk Tuk Teaser: ‘బామ్మ మాట బంగారు బాట’, ‘కారా మజాకా’ వంటి చిత్రాలలో నటీనటులతో పాటు అందులో కార్లు కూడా ప్రముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడలాంటి నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టుక్ టుక్’. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఆటో స్కూటర్. అవును, తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటో ఆటో స్కూటర్ చేసిన హంగామా మాములుగా లేదు. పైన చెప్పుకున్న సినిమాలకు ధీటుగా ఈ సినిమా రూపొందిందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. ఈ మధ్య ప్రేక్షకులు సినిమాలలో వైవిధ్యతను, న్యూ కాన్సెప్ట్ ఒరియంటెడ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అలాంటి సినిమాలకు అఖండ విజయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడలాంటి ఫీల్‌ని ప్రేక్షకులకు ఇవ్వడానికి వస్తుంది ‘టుక్ టుక్’. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
Also Read- Chhaava Telugu Trailer: గర్జనకు లొంగకపోతే పంజా వేట తప్పదు
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన తారాగణంగా చిత్రవాహిని ప్రొడక్షన్స్, ఆర్ వై జి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టుక్ టుక్’. సి. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ హాజరైంది.
టీజర్ విడుదల సందర్భంగా హీరోయిన్ శాన్వీ మేఘన మాట్లాడుతూ.. ‘పుష్పక విమానం’ తర్వాత నేను చేసిన ఆటోస్కూటర్ ఎంటర్‌టైనర్ ‘టుక్ టుక్’. టీజర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సర్‌ఫ్రైజ్ ఎలిమెంట్స్‌ను ఎంజాయ్ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని తెలపగా, హీరోలు రోషన్, కార్తికేయ, నిహాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది ముగ్గురు యువకుల జర్నీ. వాళ్ల జీవితంలో వచ్చిన మ్యాజికల్ ఎలిమెంట్స్‌ను ఎలా ఫేస్ చేశారనేది థియేటర్లో చూసే తెలుసుకోవాలి. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటుండదు. అందరికీ మంచి కిక్ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ముగ్గురు యువకులు ఎంటర్‌టైన్ చేస్తే, సెకండాఫ్‌లో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంటుంది. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఫాంటసీ, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్నాయి. మార్చి 21న అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూడండి.. టైమ్‌కు, మనీకి వేల్యూ ఇచ్చే సినిమా ఇది’’ అని అన్నారు. దర్శకుడు సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. అతి త్వరలో ఈ సినిమా గురించి ఓ బిగ్గెస్ట్ సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్నాం. అది చూసి అందరూ షాక్ అవుతారని అన్నారు.

ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!