Trikala Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Trikala Trailer: అబ్బో.. ట్రైలరే ఇలా ఉందంటే.. ఇక సినిమా!

Trikala Trailer: ప్రస్తుతం సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్‌తోనే ఆ సినిమా హిట్టా? ఫట్టా? అనేది చెప్పేయవచ్చు. అందుకే సినిమాపై ఎంత ఎఫర్ట్ పెడతారో.. టీజర్, ట్రైలర్ విషయంలో కూడా మేకర్స్ అంతే ఎఫర్ట్ పెడుతుంటారు. ఎందుకంటే, సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేయడంలోనూ, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ ట్రైలర్, టీజర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి కాబట్టి. తాజాగా విడుదలైన ‘త్రికాల’ ట్రైలర్ చూస్తుంటే.. ట్రైలర్ ఇంపార్టెన్స్ ఏమిటో మరోసారి అందరికీ తెలుస్తుంది. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీసాయిదీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా మణి తెల్లగూటి రూపొందిస్తోన్న చిత్రం ‘త్రికాల’. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!

‘త్రికాల’ ట్రైలర్ ఎలా ఉందంటే..
రోమాలు నిక్కబొడుచుకునేలా ఆద్యంతం విజువల్ ఫీస్ట్‌లా ఈ ట్రైలర్ ఉందంటే అతిశయోక్తి కానే కాదేమో. ‘యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. కంటి రెప్ప కొడితే ఏ సీన్ మిస్ అవుతుందో అనేలా.. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని ట్రైలర్‌లోని ప్రతి షాట్ తెలియజేస్తుంది. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను పరిచయం చేసిన విధానం, మాస్టర్ మహేంద్రన్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, ఇంకా డైలాగ్స్ ఇలా అన్నీ కూడా వావ్ అనేలా అదిరిపోయాయి. సినిమాపై అంచనాలను పెంచడంలో ఈ ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.

ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘అజయ్ కే ముందుగా ఈ కథను చెప్పాను. వీఎఫ్ఎక్స్ జాగ్రత్తగా చూసుకో అని ఆయన సలహా ఇచ్చారు. ‘త్రికాల’ సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్‌లో పెట్టాం. అంబటి అర్జున్ ఈ సినిమా కోసం ఒకే ఒక్క రోజు షూటింగ్ చేశారు. ఆ పాత్ర ఇంపార్టెన్స్ తర్వాత తెలుస్తుంది. ఈ మూవీకి నాతో పాటు అన్ని రోజులు పని చేశాడు మహేంద్రన్. సాహితి పాత్రను ఎక్కువగా రివీల్ చేయకూడదని ఫిక్స్ అయ్యాం. రూప పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుంది. సెట్‌లో రవి వర్మ ఎప్పుడూ ఇది జరుగుతుందా? అని కంగారు పడుతుండేవారు. సాయిదీప్, వెంకట రమేష్ సెట్‌లో చాలా కష్టపడ్డారు. షాజిత్, హర్ష వర్దన్ రామేశ్వర్ సంగీతం ఈ సినిమా హైలెట్స్‌లో ఒకటి. మా నిర్మాతలు రాధిక, శ్రీనివాస్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం మేము చాలా వదులుకున్నాం. ఈ సినిమాకు నా రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంతో సపోర్ట్ చేసింది. ఈ జర్నీలో అజయ్ సహకారం మరిచిపోలేను. సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం మాట్లాడుతూ.. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమా ఇస్తుందని అన్నారు.

Trikala Movie Trailer Launch Event
Trikala Movie Trailer Launch Event

ఇవి కూడా చదవండి:

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Mangli Open Letter: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. అదంతా ఫేక్ ప్రచారం

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు