Tollywood
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: యంగ్ హీరోకు చుక్కలు చూపిస్తున్న బిగ్ ప్రొడక్షన్ హౌస్

Tollywood: ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్స్‌తో మెస్సివ్ హిట్ అందుకున్న ప్రొడక్షన్ హౌస్.. అదే బ్యానర్‌లో ప్రస్తుతం సినిమా చేస్తున్న ఓ యంగ్ హీరోకు చుక్కలు చూపిస్తుందట. అసలే వరుస పరాజయాలతో బ్యాడ్ పేజ్‌లో ఉన్నాడా హీరో. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న ఆ సంస్థ.. ఆ హీరో సినిమాకు అనుకున్న బడ్జెట్ కట్ చేసి తక్కువ బడ్జెట్ తోనే సినిమాని పూర్తి చేయాలని చూస్తోందట. ఇంతకు ఆ నటుడు ఎవరు? ప్రొడక్షన్ కంపెనీ ఏంటంటే..

ఈ నటుడి చివరి ఆరు సినిమాలు డిజాస్టర్లుగా నిలవగా, ఆయన లేటెస్ట్ ఫిల్మ్.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. కానీ.. ప్రేక్షకులు, విమర్శలు ఈ సినిమాని తీసి అవతల పడేశారు. చాలా మందికి ఫేవరెట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై.. కథలో లాజిక్స్, సారం లేకపోవడంతో ప్రేక్షకులని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది ఇలా ఉండగా ఈ హీరో అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పెట్టుబడిలో కోతలు విధించినట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా రూ.70-80 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ కు కుదించారట. మరి దీనికి సినిమాపై నమ్మకం కోల్పోవడం కారణమా? లేదా ఇంకేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సినిమా షూట్‌ను కంప్లీట్ చేయాలని ప్రొడక్షన్ యూనిట్‌కు నిర్మాతలు ఆర్డర్స్ జారీ చేసినట్లుగా టాక్.

Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!

దెబ్బ మీద దెబ్బ

ఇప్పటికే ప్రొడక్షన్ కంపెనీ తీరుతో చుక్కలు చూస్తున్న హీరోకు పుండు మీద కారం పోసినట్లు చేశాడు ఓ సీనియర్ నటుడు. విలక్షణ నటుడిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఓ నటుడు కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. అయితే.. భారీ రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేసే ఆ నటుడు తప్పుకోవడమే నయం అయ్యిందని నిర్మాతలు భావిస్తున్నారట.. ఆయన స్థానంలో తక్కువ పాపులారిటీ ఉన్న మరో నటుడుని కాస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: 

Ranveer Allahbadia: ప్రధాని చేతుల మీదుగా అవార్డు, ఇప్పుడు దారుణంగా ట్రోల్.. ఎవరి రణ్‌వీర్ అల్లాబాదియా?

Prabhas: బలవంతుడైన ప్రభాస్‌కి మరింత బలం చేకూరింది..

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు