OTT Movies: ప్రతి వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే, ఈ వారం కూడా అద్భుతమైన కంటెంట్ లైనప్ తో ప్రేక్షకులను అలరించడానికి కొత్త మూవీస్ వచ్చేస్తున్నాయి. హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా నుండి థ్రిల్లర్ వరకు, మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ థ్రిల్లర్ వరకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, OTT లో రిలీజ్ అయ్యే సినిమాలను మిస్ చేయకుండా చుడండి. రాబోయే రోజుల్లో నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్ స్టార్ లో సందడీ చేయబోయే సినిమాల లిస్టును ఇక్కడ చూసేద్దాం..
టెస్ట్ ( Test ) (నెట్‌ఫ్లిక్స్, ఏప్రిల్ 4)
చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు వ్యక్తులు గొడవ పడతారు. ఈ కథ వారి చుట్టూ తిరుగుతుంది. ఇది వారిని జీవితాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ మూవీలో హీరో మాధవన్, హీరోయిన్ నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 4 న అన్ని దక్షిణాది భాషలలో హిందీలో విడుదల కానుంది.
Also Read: Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు.. సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో నిత్యం… అదేపని
అదృశ్యం 2 ( Adrishyam 2 ) (సోనీలివ్, ఏప్రిల్ 4)
ఏదైన జరగడానికి ముందే ఆ ప్రమాదాన్ని ఆపడానికి తెరవెనుక నుండి టాప్ సీక్రెట్ ఏజెంట్ల టీమ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. ఈ సిరీస్ లో ఐజాజ్ ఖాన్, పూజా గోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుండి సోనీలివ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
Also Read: CM Revanth Reddy: పేదలకు సీఎం రేవంత్ అదిరిపోయే ఉగాది కానుక.. సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం
చమక్: ది కన్‌క్లూజన్ ( Chamak: The Conclusion) (సోనీలివ్, ఏప్రిల్ 4)
తన తండ్రి మరణానికి కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న కాలా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతని కుటుంబ వారసత్వం వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీస్తాడు. ఈ సిరీస్‌లో మనోజ్ పహ్వా, గిప్పీ గ్రెవాల్, పరమవీర్ చీమా, మోహిత్ మాలిక్, ఇషా తల్వార్, నవనీత్ నిషాన్ కీలక పాత్రల్లో నటించారు. చమక్: ది కన్‌క్లూజన్ ఏప్రిల్ 4 నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: CBI Case on IT officers: ఆదాయపన్ను శాఖలో అవినీతి తిమింగలాలు.. పట్టేసిన సీబీఐ.. కేసులు నమోదు
టచ్ మీ నాట్ ( Touch Me Not ) (జియో హాట్‌స్టార్, ఏప్రిల్ 4)
ఒక కేసును పరిష్కరించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసే అతీంద్రియ స్పర్శ శక్తి కలిగిన యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కానీ, ఒక రహస్య హంతకుడు వారిని వెంటాడుతూ ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ లో నవదీప్, దీక్షిత్ శెట్టి, బబ్లూ పృథివీరాజ్, కోమలీ ప్రసాద్, సంచిత పూనాచ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవ్వనుంది.