Sangeetha: సంగీత అనగానే మనకీ ముందు గుర్తొచ్చేది ఖడ్గం సినిమా. ఈ ముద్దుగుమ్మ తెలుగులో (Tollywood) “ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్” అనే డైలాగ్ తో అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా, కథకి ప్రాధాన్యతను ఇస్తూ తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గత రెండు రోజుల నుంచి ఈ నటి తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. నిజం చెప్పాలంటే, ఈ రూమర్ ఇలా క్రియేట్ అవ్వడానికి కారణం సంగీతనే. ఇక ఇప్పుడు ఈ వార్తలపై రియాక్ట్ అవుతూ మరో బిగ్ బాంబ్ పేల్చింది.
Also Read: Viral Video: ఎవడ్రా వీడు.. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయకుండా, నూనెలో కరిగించి బజ్జీలు.. వీడియో వైరల్
భర్త ఫొటోలు డిలీట్ చేసి ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్స్?
సినీ తారల గురించి ఏ చిన్న వార్తలు తెలిసిన కూడా అదే పనిగా వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు అవే ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే హన్సిక మోత్వానీ లాంటి హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ వివాహ ఫోటోలను తొలగించడంతో విడాకుల ఊహాగానాలకు తెర లేపాయి. ఇక ఇప్పుడు రవితేజ హీరోయిన్ సంగీత క్రిష్ కూడా భర్తకి విడాకులు ఇస్తోందంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఆమె చెవిన పడటంతో ఆమె ఘాటుగానే స్పందించింది.
భర్తతో విడాకులు.. సంగీత రియాక్షన్ ఇదే..
(Sangeetha Krish) సంగీత క్రిష్, 2009లో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ క్రిష్ (Singer Krish) ను వివాహం చేసుకుంది. ఈ జంటకు 2012లో శివియా అనే కుమార్తె జన్మించింది. అయితే, ఇటీవల సంగీత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరును Sangeetha Krish నుంచి Sangeetha.actగా మార్చడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెర లేపింది. సోషల్ మీడియాలో వస్తున్న విడాకులు వార్తలను సంగీత ఖండించింది. నేను నా భర్తతో విడాకులు తీసుకుంటున్నా అని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి నా పేరును ఇన్ స్టాలో సంగీత యాక్టర్ గానే ఉంచుకున్నా అని తెలిపింది. మరి ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.
Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు