iBomma: ఐబొమ్మ వెబ్ సైట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమా వస్తే చాలు ఫస్ట్ ప్రింట్ ను పైరసీ చేయడం, వాళ్ళ సైట్ లో అప్లోడ్ చేయడం. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. అయితే, రీసెంట్ గా పోలీసులకే సవాల్ విసిరాడు. సవాల్ విసిరితే ఎవరైనా సీరియస్ గానే తీసుకుంటారు కదా.. పోలీసులు ఐబొమ్మ నడిపే నిర్వాహకుడిని పట్టుకుంది.
ఐబొమ్మ(iBOMMA) వెబ్ సైట్ ఓనర్ ఇమ్మడి రవిని తెలంగాణ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఇమ్మడి రవిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో నివసిస్తూ ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్న రవి. తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేసి తన సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాడు. చిత్రం రిలీజ్ అయిన కొన్ని నిముషాల్లోనే HD ప్రింట్‌ను ఐబొమ్మలో అప్‌లోడ్ చేయడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామంటూ తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు అరెస్ట్ పై తండ్రి ఇలా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం మాట్లాడారో ఇక్కడ చూద్దాం..
ఇమ్మడి రవి తండ్రి మాట్లాడుతూ ” నా కొడుకు పోలీసులకు ఛాలెంజ్ విసిరి తప్పు చేశాడు. వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని నాకు అస్సలు తెలియదు, హైదరాబాద్‌లో జాబ్ వచ్చిందని చెప్పాడు అంతే. నేను కూడా అదే ఉద్యోగం చేస్తూ బతుకుతున్నాడని ఇన్ని రోజులు అనుకున్నాను. నా కొడుకు చేసిందే వెదవ పని, మళ్లీ ప్రభుత్వాన్ని సవాల్ చేయడం ఇంకా పెద్ద తప్పు. నా కొడుకు విదేశాల్లో ఉన్నాడని, కోట్లు సంపాదిస్తున్నాడన్న విషయం నాకు తెలియదు, ఉంటే తింటాను లేకుంటే పస్తున పడుకుంటాను. ఐబొమ్మ విషయంలో నా కొడుకుకి సపోర్ట్ చేసిన వాళ్లు కూడా నా కొడుకు లాంటి వాళ్లే అనుకోవాలి. నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఈ మధ్య విడిపోయారని విన్నాను ” అని ఇమ్మడి రవి తండ్రి అప్పారావు చెప్పారు.
