Mirai Telugu Movie: తెలుగు సినిమా చరిత్రలో ‘మిరాయ్’ సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నోరికార్డులు బద్దలగొట్టింది. ఈ సినిమాతో తేజ సజ్జా వరసగా రెండు సినిమాలతో వంద కోట్ల క్టబ్ లో అడుగు పెట్టారు. అయితే ఈ సినిమా విజయం సాధించిన తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సినిమా విజయం సాధించడానికి దోహదపడిన పడిన పలువురు గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా గెటప్ శ్రీను డార్క్ హ్యూమర్ లేకపోతే ఈ సినిమా ఇంతిలా ఆడేది కాదని వారి గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఈ సినిమా డార్క్ కామెడీ అవసరమని అందుకే వారిని తీసుకున్నామని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో లాగా తనకు ఆ తరహా కామెడీ అంటే చాలా ఇష్టమని తనకు ఆ సినిమాలో స్పూర్తి అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు ‘హనుమాన్’ సినిమాలో కూడా గెటప్ శ్రీను తేజా తో కలిసి నటించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించడంతో వీరి కాంబోకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.
తేజ సజ్జా ‘హను-మ్యాన్’ సినిమాతో సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన తర్వాత, తన తదుపరి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’ (Mirai Telugu Movie)తో మరోసారి ప్రేక్షకుల మనసులను ఆకర్షించాడు. ఇప్పటికే విడుదలైన ఈ తెలుగు చిత్రం, కార్తీక్ గట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తీర్చిదిద్దబడింది. ఈ సినిమా యాక్షన్, సై-ఫై, థ్రిల్లర్ మిథాలజీ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్ స్పెక్టాకుల్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇండియన్ జపాన్ యానిమే శైలిని మిక్స్ చేసి చూపించారు.
Read also-Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్
చిత్రం కథ అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత తన అమూల్యమైన శక్తులను తొమ్మిది పవిత్ర గ్రంథాలలో మార్చిన నేపథ్యంపై ఆధారపడింది. ఈ గ్రంథాలు ఏ మనిషినైనా దేవుడిని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. వేద ప్రజాపతి (తేజ సజ్జా) ఈ గ్రంథాలను కాపాడటం కోసం ఎదుర్కొన్న అడ్వెంచర్ ముఖ్య భాగం. చెడ్డ శక్తి మహాబీర్ లామా (మంచు మనోజ్) ఈ గ్రంథాలను సంపాదించాలని ప్రయత్నిస్తాడు. దీనికి వేద మేనల్లుడు అంబికా ప్రజాపతి (శ్రీయా శరణ్) కుటుంబ రహస్యాలు విభా (రితికా నాయక్) వంటి పాత్రలు మలుపు తిప్పుతాయి. హిమాలయాల్లోని మిరాయ్ స్టాఫ్‌ను సంపాదించి, ఆధ్యాత్మిక ఫిజిక్స్ రామాయణం నుంచి సాంపాతి పక్షి వంటి ఎలిమెంట్స్‌తో వేద సూపర్ యోధుడిగా మారతాడు. ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్, క్లైమాక్స్ గ్రాండ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు.