Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. త్వరలో ఫ్యాన్స్ కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తానని అన్నాడు. ఈ వార్త వినగానే .. ఎన్టీఆర్ అభిమానులు ఎగిరి గంతేసారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని అన్ని ప్లాన్ చేస్తే.. ఆ రోజూ అంచనాలకు మించి ఫ్యాన్స్ రావడంతో ఈవెంట్ ను మధ్యలోనే ఆగిపోయింది.
Also Read: Charminar Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా!
ఈ ఈవెంట్ ఫ్యాన్స్ కోసమే ప్లాన్ చేసి నిర్వహిస్తానని.. ఫ్యాన్స్ ని కలుసుకుంటానని ఎన్టీఆర్ తెలిపారు. తమిళనాడులో రజనీకాంత్ కూడా మూవీస్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను మీట్ అవ్వడానికి చిన్న ఈవెంట్స్ నిర్వహిచడం మనం చూసాము.
అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అవ్వనున్నడా అనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు సినిమా ఫంక్షన్లో మెరిసిన తారక్ .. ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్ ని మీట్ అవ్వాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, గత కొద్దీ రోజుల నుంచి ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ పెట్టి, ఫ్యాన్స్ ముందు ఆ విషయాన్ని చెబుతాడనే వార్తలు వస్తున్నాయి.
Also Read: Naga Chaitanya: మామ లవర్ తో నాగచైతన్య బోల్డ్ రొమాన్స్.. ఘాటు సీన్స్ తో కుర్రకారుకు మతి పోవడం పక్కా!
ఆ రోజూ ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను నిర్వహించే ఈవెంట్ కోసం అందరూ ఓపికతో ఎదురు చూడాలని.. నందమూరి అభిమానులంటేనే సహనానికి మారుపేరు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎన్నడూ లేనిది తారక్ స్వయంగా అభిమానుల కోసం ఈవెంట్ నిర్వహిస్తా అని చెప్పడంతో ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయ వర్గాల్లో కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు.