Alekhya Chitti Pickles: రమ్య గోపాల్ కు సినిమా ఛాన్స్ రావడం పై ట్రోలింగ్ చేస్తున్నారు. మా వలనే సినిమా వరకు వెళ్ళింది. క్రెడిట్ మొత్తం మాదే అంటూ నెటిజన్స్, ట్రోలర్స్ అందరూ కలిసి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే, తాజాగా ట్రోలింగ్ పై అక్క సుమ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏం మాట్లాడిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : Naga Chaitanya: మామ లవర్ తో నాగచైతన్య బోల్డ్ రొమాన్స్.. ఘాటు సీన్స్ తో కుర్రకారుకు మతి పోవడం పక్కా!
అలేఖ్య చిట్టి పికిల్స్ సుమ మాట్లాడుతూ ” మీరు అనుకోవచ్చు .. ఏంటి మీ చెల్లి స్టేజ్ మీద నిలబడినందుకే అంత హ్యాపీగా ఉందా? అని.. అయితే, మేము చాలా నార్మల్ పీపుల్.. ఆ స్టేజ్ వరకు వెళ్ళిందంటే అది మాకు గొప్ప విషయం. అందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. నేను మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే, మా చెల్లీ ఎంత కష్ట పడిందో నాకు మాత్రమే తెలుసు ” అని చెప్పింది.
Also Read : Saraswati Pushkaralu:సరస్వతి పుష్కరాల్లో మంత్రి తుమ్మల సందర్శన.. అభివృద్ధి పనులపై సమీక్ష!
ఇంకా ఆమె మాట్లాడుతూ ” ఏం కష్టపడింది.. మీ చెల్లి వీడియోలే కదా చేసింది అని? మీకు సందేహం రావొచ్చు. అంటే మీకు కనిపించినంత వరకే .. కనిపించకుండా ఏం చేసిందో మాకు తెలుసు. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చిందో తెలుసు.. ఒక్కొక్క సారి చెయ్యగలనా ? లేదా అని ఆలోచిస్తూ ఉండేది. నేను ఇక చేయలేను అని అనుకున్న టైమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ రోజున ఆ స్టేజ్ వరకు వెళ్ళిందంటే క్రెడిట్ మొత్తం రమ్యకే ” ఉంటుంది.
Also Read : Actor Tarzan Laxmi Narayana: వాళ్ళు నా మీద చేతబడి చేశారు.. 12 ఏళ్లు నరకం అనుభవించా.. ఏ ఒక్కరూ లేరు నాతో!
అయితే, దీనిపై రియాక్ట్ అయిన నెటిజెన్స్ ” సరే లేండి ఎక్కువ ఫీల్ అవ్వద్దు మీరు.. లైట్ తీసుకోండి ఇట్స్ ఓకే ఇంకా వదిలేయండి” , ఈ రోజు విజయం సాధించారంటే.. అది మీ కృషి, పట్టుదల మీ నమకం వలనే గెలిచారు. ఆడపిల్లలు అయి ఉండి కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్ళారు.. అందుకు మీమల్ని చూస్తే ముచ్చటస్తోంది. మిమ్మల్ని అభిమానించడం గర్వంగా ఉంది. మీరు ఆడ పిల్లలు కాదు .. ఆడ పులులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమక్క మీరు ఆ రోజూ చెప్పారు కదా .. ట్రోల్ చేసిన వారికి జీవితం లో నిద్ర పట్టదు అని .. అదే నిజమైంది.. ఇప్పటి నుంచి వారికి నిద్ర పట్టదు లే అని వారికి సపోర్ట్ చేస్తున్నారు.