Samantha with Shubam Team
ఎంటర్‌టైన్మెంట్

Samantha: తెలుగులో సినిమాను నిర్మిస్తోన్న సమంత.. టైటిల్ ఇదే!

Samantha Turns Producer: విడాకుల అనంతరం, సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. ఏదైనా అకేషన్ ఉంటే తప్ప, టాలీవుడ్‌లో కనిపించడం లేదు. ఆ మధ్య గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’ సినిమా తర్వాత అసలు టాలీవుడ్‌లో సమంత దర్శనమే కరువైంది. ఈ మధ్య ఓ బాలీవుడ్ మూవీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే టాలీవుడ్‌కు వచ్చిన సమంత, మంచి కథలు ఉంటే టాలీవుడ్‌లో కూడా చేస్తానంటూ మాట ఇచ్చింది. మరోవైపు ఆమె పూర్తిగా బాలీవుడ్‌కు మకాం మార్చిందని, అక్కడే ఓ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే తను కూడా తన ఎక్స్ హస్బెండ్‌లా రెండో పెళ్లి చేసుకోబోతుందనేలా వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. తాజాగా టాలీవుడ్‌లో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. విషయంలోకి వస్తే..

Also Read- Devi Sri Prasad: ఎక్కడ వాయించాలో, ఎక్కడ వాయించకూడదో తెలిసినవాడే నిజమైన మ్యూజిక్ డైరెక్టర్

ఆమె నటిగా సినిమాలైతే టాలీవుడ్‌లో చేయడం లేదు కానీ, తన సొంత ప్రొడక్షన్‌ హౌస్ అయిన త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ సినిమాను నిర్మించింది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుందట. ఇదెప్పుడు జరిగిందో కూడా ఎవరికీ తెలిదు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు, చిత్రీకరణ పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చింది. అంతేకాదు, చిత్ర టీమ్‌తో సమంత కలిసి ఉన్న ఫొటోలను కూడా యూనిట్ విడుదల చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారణం, ఆమె సినిమా కోసం వారంతా ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. నటిగా కాకపోయినా, నిర్మాతగా అయినా.. చిత్ర ప్రమోషన్స్ కోసం రావాలి కాబట్టి.. టాలీవుడ్‌లో తరుచూ ఇకపై ఆమె దర్శనభాగ్యం కలిగే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.

">

ఇక సమంత నిర్మించిన సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు ‘శుభం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది ట్యాగ్‌లైన్. అతి త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని చిత్రబృందం చెబుతోంది. వసంత్ మరిగంటి రాసిన కథతో.. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు.

‘త్రాలాల మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌లో ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందని ఈ సందర్భంగా సమంత తెలిపారు. ఈ చిత్రంలో సి మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. వీరిని ‘సినిమా బండి’ సినిమాతో ప్రవీణ్ కండ్రేగుల పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీమ్‌తో ఉన్న సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Sivaji: ‘యానిమల్’లోని బాబీ డియోల్ కంటే బాగా చేశానని రాశారు.. చాలా హ్యాపీగా ఉంది

David Warner: బౌండరీ టు బాక్సాఫీస్.. గంగి రెడ్డి ఎట్టున్నది వార్నర్ మామ లుక్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు