Sai Pallavi: సాయి పల్లవి (Sai Pallavi) .. సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో అందరికంటే వెరీ స్పెషల్. ఇప్పటి వరకు చాలా మంది టాప్ హీరోయిన్లు తమ గ్లామర్ డోస్ తో పాటు స్టార్ హీరోల స్పెషల్ ఇంట్రెస్టులుగానే ఎక్కువగా పైకొచ్చారు. ఇందులో వారిని తప్పుపట్టడానికి ఏం లేదు. దీనిలో ముందుగా నిందించాల్సింది కొందరు దర్శక నిర్మాతలను మాత్రమే. ఇది పక్కనా పెడితే కెరీర్ ఆరంభం నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగేంత వరకు సాయి పల్లవి జర్నీ వెరీ స్పెషల్. గ్లామర్ డొస్ తో పాటు హీరో స్పెషల్ ఇంట్రెస్ట్ పాత్రలను ఆమె రిజెక్ట్ చేస్తూనే ఎదిగింది.
ఈ మలయాళ కుట్టి కేవలం ఒక్క పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా సౌత్ లోని అన్ని భాషల్లో నటించి ఉత్తమ నటి అనిపించుకుంది. మొదట సాయి పల్లవి ఫేస్ చూసి ఈమె ఏం హీరోయిన్ అన్నోళ్లే ఇప్పడు ఈమె కదా హీరోయిన్ అనే స్థాయికి తన ప్రతిభతో తీసుకొచ్చింది. ఇప్పటికే 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు( బెస్ట్ ఫిమేల్ డెబ్యూ సౌత్ -ప్రేమమ్, బెస్ట్ యాక్ట్రెస్- ఫిదా, లవ్ స్టోరీ, గార్గి, క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్- విరాట పర్వం, శ్యామ్ సింగ రాయ్) సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీలోనూ రామాయణంలో సీతా దేవి పాత్రలో నటిస్తుంది. చాలా మంది విమర్శకుల సైతం ఫ్యూచర్ లో సాయి పల్లవికి జాతీయ అవార్డు రావడం ఖాయం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా జాతీయ అవార్డు గురించి సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read: Allu Arjun X Atlee: అబ్బా మళ్ళీ తనేనా.. బన్నీ మూవీలోను అదే బాలీవుడ్ బ్యూటీ?
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ .. “నాకు నేషనల్ అవార్డు(National Award,) గెలవాలని ఉంది. ఎందుకంటే మా నానమ్మ నాకు ఒక స్పెషల్ శారీ గిఫ్ట్ ఇచ్చింది. ఆ శారీ నా పెళ్లి కోసం ఇచ్చింది. అయితే సినిమాల్లోకి ఎంటర్ అయ్యాక.. నేషనల్ అవార్డు గెలిచినప్పుడు ఆ శారీ ధరించడం కరెక్ట్ సందర్భం అని నేను భావిస్తున్న. అంతకు మించిన గౌరవం ఏముంటుంది. కానీ నాకు అవార్డులు, రివార్డులపై మోజు లేదు. అభిమానుల ఆధారాభిమానాలకంటే గొప్ప రివార్డులు ఏముంటాయి.” అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా నెటిజన్లు ఆ శారీ ధరించే రోజు తొందరగా రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.