S Thaman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), యువ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). భారీ అంచనాలున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన తొలి పాట ‘చికిరి’ (Chikiri Song) యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ పాటకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా 2026 మార్చి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ‘చికిరి’ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రామ్ చరణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ అందం, ఏ.ఆర్. రెహమాన్ అందించిన మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా, రామ్ చరణ్ స్టెప్స్ ‘వావ్’ అనిపించేలా ఉండడంతో, ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పాటలో డ్యాన్సుకు అత్యంత కీలకం అయిన హుక్ స్టెప్‌లు కూడా అదిరిపోవడం విశేషం.
Also Read- Jatadhara review: ‘జటాధర’గా సుధీర్ బాబు మెప్పించాడా.. లేదా ఆత్మలకు బలయ్యాడా?.. తెలియాలంటే..
థమన్ అసంతృప్తి… ఇప్పుడు సంతృప్తి
ఈ నేపథ్యంలో, మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ (S Thaman) చేసిన పాత వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer)కు థమన్ సంగీతం అందించారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో, థమన్ ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క హుక్ స్టెప్ లేదు. పాటలు ఎలా రీచ్ అవుతాయి?’ అంటూ ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం అప్పట్లో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఒక పాట మాస్ ప్రేక్షకులకు చేరాలంటే, అదిరిపోయే హుక్ స్టెప్ ఎంత ముఖ్యమో ఆ వ్యాఖ్యల ద్వారా థమన్ స్పష్టం చేశారు. థమన్ వ్యాఖ్యలను అప్పట్లో రకరకాలుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు.
Also Read- Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!
అభిమానించే హీరో సినిమాకు…
తాజాగా విడుదలైన ‘పెద్ది’లోని ‘చికిరి’ పాటలో మాత్రం థమన్ కోరుకున్నట్లుగా అద్భుతమైన డ్యాన్స్, ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునే హుక్ స్టెప్‌లు పుష్కలంగా ఉన్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. థమన్‌కు తన సినిమాకు ఆశించిన అవుట్‌పుట్ రాకపోయినా, తాను ఎంతగానో అభిమానించే రామ్ చరణ్ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కలయికతో ఇంతటి అద్భుతమైన పాట రావడంతో ఆయన ఖచ్చితంగా సంతృప్తి చెంది ఉంటారు అని సినీ వర్గాల అంతా అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, థమన్ లేవనెత్తిన ‘హుక్ స్టెప్’ అంశం ‘చికిరి’ పాట ద్వారా పూర్తి స్థాయిలో నెరవేరింది. ఈ పాట ప్రోమోను ఆయన ట్వీట్ చేయడం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
