Rithu Chowdary: చివరి వరకు రీతూ ఉంటాది అని అందరూ అనుకున్నారు కానీ, ఎవరూ ఊహించని విధంగా 13 వ వారంలో రీతూ ఎలిమినేట్ అయింది. టాప్ 5 లో ఉంటుందని ప్రేక్షకులు కూడా అనుకున్నారు కానీ, బయటకు వచ్చేసింది. అయితే, వచ్చి రాగానే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది.
తనూజ వాష్ రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు, పవన్ అలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అడగగా .. దానికి రీతూ.. ఆమె ఆ కామెంట్ పాస్ చేసింది కానీ, నేనెప్పుడూ ఎవరి మీద కామెంట్ పాస్ చెయ్యలేదు. నాకు ఎప్పుడూ నాకెవ్వరు అలా అనిపించలేదు. ఒక మనిషి కూర్చొనే విధానానికి , వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టలు తీరుకు ఇలా జడ్జ్ మెంట్ పాస్ చెయ్యను అని రీతూ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇంకా తనుజా మీ బెస్ట్ ఫ్రెండ్ కదా మీరేందుకు ఆమెకి సపోర్ట్ చెయ్యలేదని ఓ జర్నలిస్ట్ అడగగా.. నా ఫస్ట్ ప్రైయారిటీ పవన్ కదా.. తన ఫస్ట్ ప్రైయారిటీ కళ్యాణ్ కదా అందుకే నేను అలా అన్నాను అని చెప్పింది. అసలు హౌస్ లో నాకు ఓకే ఒక్కరూ సపోర్ట్ చేస్తారు. అది పవన్ అని నేను హౌస్ లో కూడా చెప్పాను కదా.. మిగతా వాళ్ళ అందరితో నేను ఫన్ గా ఉంటాను కానీ, అందరూ నాకు పవన్ సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే ఉందని అనుకుంటున్నారు. కానీ, నా కంటే ఎక్కువ మిగతా హౌస్ మేట్స్ కి ఉన్నారని క్లారిటీ ఇచ్చింది.
ఇమ్మనుయేల్, మీరు ఇద్దరూ కలిసి జబర్దస్త్ చేశారు, కానీ ఇంట్లో ఎందుకు మీరు ఫ్రెండ్స్ లాగా లేరని ఓ జర్నలిస్ట్ అడగగా.. బయట ఎలా ఉన్నామో .. ఇంట్లో కూడా అలాగే ఉన్నాము. కాకపోతే అది చూపించలేదని చెప్పింది. టాప్ 5 లో ఎవరు ఉంటారని రీతూని అడగగా.. డెమోన్ పవన్, తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, సంజన ఉంటారని చెప్పింది. మరి, కప్పు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారని అడగగా… ఎవరు గెలిస్తే వాళ్ళు కప్పు తీసుకుంటాని ఫన్నీగా చెప్పింది. ఇక భరణి నుంచి అడగ్గా.. ఆయన ఎలా ఆడుతున్నారో మీకే తెలియాలి నాకు తెలియదని చెప్పింది. బిగ్ బాస్ లో బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరని అడగ్గా.. తనూజ అని చెప్పింది.

