King Nagarjuna: కింగ్ నాగార్జున ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ (Shiva) బాక్సాఫీసు రికార్డులని తిరగరాస్తూ.. ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’, ‘ఆఫ్టర్ శివ’గా మార్చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో 1989లో విడుదలైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా ఈ చిత్రాన్ని 4K (Shiva 4K) డాల్బీ ఆట్మాస్‌లో నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో రీ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. సోమవారం మీడియాకు స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌కు కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున (King Nagarjuna) మాట్లాడుతూ..
Also Read- Mana Shankara Vara Prasad Garu: ఐటమ్ సాంగ్ చేస్తున్నది ఎవరో తెలుసా? ఇందులోనూ అనిల్ మార్కే!
ఇదంతా రాము ఎఫర్ట్
‘‘36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌లో మళ్లీ ఇలా కలుస్తామని నేను కలలో కూడా అనుకోలేదు. శివకి ఇంత ఆదరణ, కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ కేర్ తీసుకుని చేశాడో.. ఈ రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశాడు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుందని అంటున్నారు. ఇదంతా రాము చేసిన ఎఫర్ట్.. డాల్బీ అట్మాస్‌కి తగినట్లుగా ఈ సౌండ్‌ని రీ క్రియేట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్ చాలా అద్భుతమైన వర్క్‌ని ప్రదర్శించింది. ఇప్పుడీ సినిమాను చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారో.. మొన్న నేను చూసి అంతే కొత్తగా ఫీలయ్యా. నాకయితే కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా.. సౌండ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. అప్పట్లో.. ఫస్ట్ టైమ్ సౌండ్ బాగుంది అనే టాకు ఈ సినిమాకు విన్నాను.
Also Read- Bharani Bonding: బిగ్ బాస్ హౌస్‌లో భరణి బాండింగ్ బద్దలైంది.. ఈ వారం ఎవరిని నామినేట్ చేశాడో తెలుసా?
ఎందుకు ఇది కల్ట్ సినిమా?
ఈ సినిమాకు మాకు చాలా పర్సనల్. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ యానివర్సరీ రోజున సినిమాని రీరిలీజ్ చేయాలనుకున్నాం. నిజానికి పదేళ్ల క్రితమే 4కే చేశాము. అప్పుడు డాల్బీ జరగలేదు. ఇప్పుడు అన్ని హంగులతో ఒక స్పెషల్ అకేషన్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇది ఏదో ప్రాఫిట్ కోసం చేయలేదు. సినిమాకు ఏం కావాలో.. అది రాము అడిగాడు. మేమిచ్చామంతే. రాము స్ట్రాంగ్ విజన్, కన్వెన్షన్‌తో వచ్చారు. సినిమాని ఇలా కూడా తీయవచ్చని చూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. ఈ విషయంలో సంథింగ్ మ్యాజిక్ జరిగిందని నేను అనుకుంటున్నాను. నాన్న ఈ సినిమా చూసి.. ‘సినిమా పెద్ద హిట్. చాలా మంచి సినిమా చేశావ్. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో తెలియదు’ అని అన్నారు. రీ రిలీజ్ సినిమాలకి ‘శివ’ కచ్చితంగా ఒక కొత్తబాటని చూపిస్తుంది. మనకు ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పటి జనరేషన్ చూడాలని అనుకుంటుంది. ఇలా ప్రతి భాషలో చూడాల్సిన క్లాసిక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ‘శివ’ ఒక పాత్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నాను. దానికి కూడా రామునే ఆద్యుడుగా నిలుస్తాడు. ‘శివ’ సీక్వెల్ చేసేంత ఘట్స్ చైతూ, అఖిల్‌లకు లేవని నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
