Bharani Bonding: బిగ్ బాస్ హౌస్‌లో భరణి బాండింగ్ బద్దలైంది
Divya vs Bharani Bigg Boss (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Bharani Bonding: బిగ్ బాస్ హౌస్‌లో భరణి బాండింగ్ బద్దలైంది.. ఈ వారం ఎవరిని నామినేట్ చేశాడో తెలుసా?

Bharani Bonding: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మొదలైన మూడు వారాల తర్వాత భరణి గ్రాఫ్ గమనిస్తే.. టాప్ 1లో ఉంది. ప్రజంట్ బిగ్ బాస్ హౌస్‌లో భరణి గ్రాఫ్.. ఎగ్జిట్‌కు దగ్గరగా ఉంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆడియెన్స్ కాపాడకపోతే.. కచ్చితంగా భరణి ఎలిమినేట్ అయ్యేవారు. ఆల్రెడీ ఎలిమినేటై బయటికి వెళ్లిన భరణికి.. బిగ్ బాస్ మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మళ్లీ హౌస్‌లోకి వచ్చిన భరణి.. ఈసారి ఎటువంటి బంధాల్లో ఇరుక్కోకుండా, తన గేమ్ తను ఆడతాడని అంతా అనుకున్నారు కానీ, ఆ బంధాల నుంచి భరణి (Bharani) బయటకు రాలేక సతమతమవుతున్నట్లుగా చూస్తున్న ప్రతి ఆడియెన్‌కు తెలిసిపోతుంది. అందుకే, తాజాగా నాగ్ ఆడించిన ట్రోఫీకి దగ్గరగా ఎవరు? ఎగ్జిట్‌కు దగ్గరగా ఎవరు? అనే టాస్క్‌లో భరణి అట్టడుగుకు పడిపోయారు. ఇదంతా గమనించినట్లుగా ఉన్నాడు.. ఈ వారం నుంచి తన ఆటని మార్చాడు భరణి. ఆ విషయం తాజాగా వచ్చిన ప్రోమో తెలియజేస్తుంది.

Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!

భరణికి మరో ఛాన్స్

వాస్తవానికి భరణి రీ ఎంట్రీ ఇవ్వడానికి.. ఆయన బాండింగ్ పెట్టుకున్న దివ్య (Divya) సపోర్ట్ ఎంతో ఉంది. శ్రీజ, భరణిల మధ్య జరిగిన రీ ఎంట్రీ టాస్క్‌లలో భరణి ప్లేస్‌లో దివ్య ఓ గేమ్ ఆడి గెలిపించింది. ఇక, ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్‌లో తనూజ తన దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ నొక్కి సాయి శ్రీనివాస్‌ని సేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా, ఆమె అందుకు స్టాండ్ తీసుకోలేదు. నిజంగా ఆమె సాయి కోసం బజర్ నొక్కి ఉంటే.. భరణి ఎలిమినేట్ అయ్యేవారు. సో.. మరో ఛాన్స్ భరణికి వచ్చినట్టే భావించాలి. దివ్య, తనూజ వారిద్దరూ భరణికి సపోర్ట్ చేసినట్లే భావించాలి. కానీ హౌస్‌లో వారిద్దరి మధ్య, వారితో ఉన్న బాండింగ్‌ల మధ్య భరణి నలిగిపోతున్నాడు. సరైన స్టాండ్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ, ఆదివారం దాదాపు ఎలిమినేషన్ వరకు వెళ్లడంతో.. తను ఇక బంధాల నడుమ బంధీ కాకూడదని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఈ మండే నామినేషన్స్‌లో ఏకంగా దివ్యనే ఆయన నామినేట్ చేసి.. ఆడియెన్స్‌కు ఐ యామ్ బ్యాక్ అనే సిగ్నల్‌ని పంపారు. తాజాగా వచ్చిన ప్రోమోలో ఇదే హైలెట్ అవుతోంది. అసలీ ప్రోమోలో ఏముందంటే..

Also Read- RT76: భర్త మహాశయులకు ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

బాండింగ్స్ బద్దలు

రీతూ, సంజన, దివ్య, గౌరవ్ నామినేటై.. షవర్ కిందకు వెళ్లినట్లుగా ప్రోమో మొదలైంది. ‘నేను కెప్టెన్ అవకూడదు.. కానీ తనని కెప్టెన్‌ని చేయాలి. నేను ఇక్కడేమీ ఎన్‌జిఓ నడపడం లేదు కదా. నాకోసం వచ్చాను’ అని సంజన వివరణ ఇస్తోంది. తర్వాత దివ్యను నామినేట్ చేసి.. ‘నీ వల్ల నా గేమ్ పాడవలేదు’ అని భరణి అంటుంటే.. ‘మరి నన్ను నామినేట్ చేస్తే ఎలా?’ అని దివ్య అరిచేస్తుంది. భరణి కూడా సేమ్ టోన్‌లో ‘అది తప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందా? లేదా?.. నిన్న కూడా నాగార్జున సార్ ఏమన్నారు.. భరణి ఎక్కడో ఉండాల్సిన వాడు.. బాండింగ్స్ వల్ల పడిపోయానని అన్నారు’ అని భరణి అంటే.. ‘దివ్య వల్లే అని అన్నారా? బాండింగ్‌లో నేను ఒక్కదాన్నే ఉన్నానా?’ అని దివ్య కూడా తగ్గకుండా అడుగుతుంది. ‘బాండింగ్స్.. టైమ్ వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను’ అని భరణి సీరియస్‌గా సమాధానమిచ్చారు. అలా వారిద్దరి మధ్య వాగ్వివాదం నడుస్తుంది. ఆ తర్వాత నిఖిల్, రీతూల మధ్య వార్ నడుస్తుంది. గౌరవ్, సంజన వాదించుకుంటున్నారు. ఫైనల్‌గా మళ్లీ దివ్య, భరణిల మధ్య ఫైరింగ్ నడుస్తుంది. మొత్తంగా అయితే భరణి బాండింగ్స్ బద్దలు కొట్టి ముందుకు వెళ్లాలని స్ట్రాంగ్‌గా ఫిక్సయినట్లుగా అయితే ఈ ప్రోమో తెలియజేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. దేశం వీడిన 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజనీర్లు.. కారణం ఏంటంటే?

Toy Train Kailasagiri: బ్రేకులు ఫెయిలై.. వెనక్కి వెళ్లిన ట్రైన్.. తృటిలో తప్పిన ముప్పు!

Nukala Ramachandra Reddy: ప్రజల కోసమే జీవించిన నాయకడు.. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం నూకల రామచంద్రారెడ్డి!

Ariana Glory: వర్షతో కిసిక్ టాక్స్‌లో సందడి చేసిన అరియానా.. రూమ్ రెంట్ కోసం ఏం చేసేదంటే?

Jabalpur: జబల్పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో మహిళపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్