Barrelakka: బర్రెలక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వారి సొంత టాలెంట్ తో ఫేమస్ అయితే.. ఒక్క వీడియోతో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, తనని ట్రోల్స్ చేస్తున్న వారిపై ఏడ్చుకుంటూ సంచలన వీడియో రిలీజ్ చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
బర్రెలక్క ( Barrelakka )మాట్లాడుతూ ” మూడు రోజుల నుంచి బాగా జ్వరంగా ఉంది. తలనొప్పి, జలుబుతో చాలా బాధ పడుతున్నాను. ఇక జలుబు అయితే మరి.. బాగా ఇబ్బంది పెడుతుంది. జ్వరం వచ్చిందని వీడియో చేసి పెడితే చాలా మంది కాల్స్, మెసేజెస్ చేసారు. అయితే, మీరు ముందు నన్ను అడగాల్సిన ప్రశ్న ఏంటి? జ్వరం తగ్గిందా? టైం కి మెడిసిన్స్ వేసుకో .. టైం తిను అని చెప్పాలి కదా.. అది కాకుండా.. వేరే ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. బేబీ ఆరోగ్యంగా ఉందా? బేబీ జాగ్రత్త అని ఇలాంటివి చెబుతున్నారు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా.. నా బేబీ ఆరోగ్యంగా ఉండేది అంటూ బర్రెలక్క కన్నీళ్లు పెట్టుకుంది.
బర్రెలక్క రాజకీయ జీవితం
బర్రెలక్క 2023లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలు, రైతుల సమస్యలు, గ్రామీణ అభివృద్ధిని ప్రధాన అంశాలుగా చేసుకున్నారు. అయితే, ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసింది కానీ, గెలవలేదు. ఆమె రాజకీయ ప్రవేశం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది. ఆమె మాట్లాడిన మాటలు, స్థానిక యాస ప్రజలను ఆకట్టుకున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.
