Jack First Single: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలై టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఒక సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఏదో న్యూ పాయింట్‌ను ఇందులో చెప్పబోతోన్నారనే విషయాన్ని టీజర్ తెలియజేసింది. ప్రస్తుతం టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వివరాల్లోకి వెళితే..
Also Read- Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?
‘పాబ్లో నెరుడా పాబ్లో నెరుడా’ వచ్చిన ఈ సాంగ్ హుషారుగా ఉండటమే కాకుండా.. వినగానే ఎక్కేసేలా ఉంది. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా.. అచ్చు రాజమణి బాణీ ఎంతో క్యాచీగా ఇచ్చారు. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరింత అట్రాక్షన్‌గా పాటను మార్చేసింది. అలాగే ఈ పాటకు బెన్నీ దయాల్ వాయిస్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇవన్నీ ఇలా ఉంటే సిద్దు ఈ సినిమాతో స్టైల్ ఐకాన్ బిరుదును సొంతం చేసుకుంటాడనేలా అతని కాస్ట్యూమ్స్ ఉండటం విశేషం. ఇప్పటికే సిద్దు అంటే యూత్ అంతా పడి చస్తున్నారు. టిల్లు అన్న అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఈ పాటతో ఆయన అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో పరిచయ గీతంతో అంచనాల్ని మరింతగా పెంచేసింది టీమ్.
ఇప్పుడున్న యంగ్ హీరోలలో కాస్త ఢిపరెంట్‌గా వెళుతూ సక్సెస్‌లు అందుకుంటున్న హీరో ఎవరయ్యా అంటే, కచ్చితంగా అంతా సిద్దు జొన్నలగడ్డ పేరే చెబుతారు. ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో ఆయన బాక్సాఫీస్‌పై ప్రదర్శించిన ఇంపాక్ట్ అలాంటిది. ప్రస్తుతం సిద్దు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయంటే, ‘టిల్లు’తో సిద్దు సృష్టించిన సునామీ అలాంటిది. ‘జాక్’ కూడా ఈ స్టార్ బాయ్ కెరీర్‌లో ఒక సక్సెస్ ఫుల్ ఫిల్మ్‌గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. కారణం, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన పంథా మార్చి మరి ఈ సినిమాను చేస్తున్నాడనేలా ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. ఆయనకు ఇప్పుడు హిట్ చాలా అవసరం. అందుకే కసిగా ఈ సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిస్తున్న ‘జాక్’ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Niharika Konidela : భర్తతో విడిపోవడంపై నిహారిక కామెంట్స్ వైరల్
Janhvi Kapoor: ఆర్‌సి 16, దేవర.. జాన్వీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ అదిరాయ్..