Janhvi Kapoor
ఎంటర్‌టైన్మెంట్

Janhvi Kapoor: ఆర్‌సి 16, దేవర.. జాన్వీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ అదిరాయ్..

HBD Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి తనయ, అందాల తార జాన్వీ కపూర్ పుట్టినరోజు (మార్చి 6) స్పెషల్‌‌గా, ఆమె తెలుగులో నటిస్తున్న రెండు చిత్రాల నుంచి స్పెషల్ లుక్స్ విడుదల చేశారు. ఆ రెండు సినిమాలలో ఒకటి ఆల్రెడీ నటించిన ‘దేవర’ కాగా, నటించబోతున్న ‘ఆర్‌సి 16’ రెండవది. ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఆమెను టాప్‌లో ట్రెండింగ్‌లోకి తెచ్చేశాయి. ఈ పోస్టర్స్‌ని షేర్ చేస్తూ మెగా, నందమూరి అభిమానులు జాన్వీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రెండు పోస్టర్స్‌లో ఆమె లుక్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలను చేస్తూనే, సౌత్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లోనూ ఆమె అరంగేట్రం చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. మరోవైపు టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోస్ ఆమె కావాలని కోరుకుంటున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రూపొందే సినిమాలోనూ జాన్వీ పేరే వినిపిస్తోంది.

Also Read- Tamannaah-Vijay varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?

RC 16 నుంచి బిహైండ్ ది సీన్‌ స్టిల్
‘ఉప్పెన’ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రం RC 16. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ పుట్టినరోజు స్పెషల్‌గా RC 16 టీమ్‌కు శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ సెట్ నుండి ఆమె స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఇది బిహైండ్ ది సీన్‌కు సంబంధించిన స్టిల్ అని తెలుస్తోంది. ఇందులో నార్మల్ డ్రస్‌లో ఓ బుజ్జి మేకను సంకలో పెట్టుకుని సంతోషంగా కనిపిస్తుంది. ఇది అఫీషియల్ లుక్ కాదని టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. మొదటి షెడ్యూల్ సమయంలో మైసూర్‌లో క్లిక్ చేసిన సాధారణ ఫోటో అని మేకర్స్ స్పష్టం చేశారు. నవంబర్ 2024లో మైసూర్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నుంచి ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లోనూ జాన్వీ కపూర్ పాల్గొనబోతోన్నారని, ఈ షెడ్యూల్ 12 రోజుల పాటు కొనసాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. జాన్వీకి రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘దేవర’ మరిచిపోలేదు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చిన ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ తంగంగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రెండో పార్ట్ చిత్రీకరణ జరగాల్సి ఉంది. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో రెండో పార్ట్‌ కథలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. జాన్వీ అదే తంగం పుట్టినరోజును మరిచిపోకుండా, మేకర్స్ ఓ బ్యూటీఫుల్ పిక్‌ని విడుదల చేసి, బర్త్‌డే విషెశ్ తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ షూట్‌లో ఉండటంతో జాన్వీకి శుభాకాంక్షలు తెలపలేదు. ఇక ఈ రెండు పోస్టర్స్‌ని ఒకసారి గమనిస్తే.. ఒక పోస్టర్‌లో చేపలు, మరో పోస్టర్‌లో మేకలు ఆమె చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:
Agent OTT: ఫైనల్లీ ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. ఎన్ని నెలల తర్వాత వస్తుందో తెలుసా?

Bigg Boss: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం