Ketika Sharma
ఎంటర్‌టైన్మెంట్

Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?

Robinhood Special Song Update: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్‌హుడ్’. ‘భీష్మ’ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి వెంకీ కుడుములతో నితిన్ చేస్తున్న చిత్రమిది. డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు పాటలు ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ థర్డ్ సింగిల్ అప్డేట్‌ని ఇచ్చారు మేకర్స్. ‘ది హాటెస్ట్ సర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ వచ్చిన ఈ అప్డేట్ నిజంగానే హీట్ ఎక్కిస్తోంది.

Also Read- Tamannaah-Vijay Varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?

సిజ్లింగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) చేసిన స్పెషల్ సాంగ్, ఈ చిత్ర థర్డ్ సింగిల్‌గా విడుదల కాబోతోంది. ఈ సాంగ్‌ని మార్చి 10న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ కేతికా శర్మ గ్లామర్ లుక్‌ని మేకర్స్ వదిలారు. ఈ ట్రాక్‌లో కేతికా అల్ట్రా గ్లామరస్‌గా కనిపించనుందని, ఇది ప్రేక్షకులను, సంగీత ప్రియులను సర్‌ప్రైజ్ చేయబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే వాళ్లు చెప్పాల్సిన అవసరమే లేదనిపించేలా ఉంది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కేతికా శర్మ గ్లామరస్ లుక్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌లతో ఆకట్టుకునే కేతికా శర్మ ఈ సాంగ్‌తో మరోసారి సెన్సేషన్ అవుతుందని ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు.

కేతికా శర్మ విషయానికి వస్తే.. అందానికి అందం, దానిని ప్రదర్శించగల నైపుణ్యం ఈ అమ్మడిలో ఉన్నా, అదృష్టం మాత్రం లేదనే చెప్పుకోవాలి. ఆమె నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఆమెకు అవకాశాలు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. అందుకే స్పెషల్ సాంగ్స్ బాట పట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ గ్లామర్ ఫొటోస్ వదులుతూ, నెటిజన్లకు నిద్రలేకుండా చేసే ఈ బ్యూటీకి, ఈ స్పెషల్ సాంగ్ బ్రేక్ ఇస్తుందనేలా టాక్ అయితే వినబడుతుంది. ఈ సాంగ్‌లో ఓ రేంజ్‌లో ఆమె గ్లామర్ ప్రదర్శన చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఆ గ్లామర్ తనకి ఎలాంటి అవకాశాలను తీసుకువస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే, కేతికా ఆశలన్నీ ఈ స్పెషల్ సాంగ్‌పైనే పెట్టుకుంది. మరి ‘రాబిన్‌హుడ్’ ఆమె కలల్ని నిజం చేస్తాడో, లేదో.. వెయిట్ అండ్ సీ.

ఇవి కూడా చదవండి:
Agent OTT: ఫైనల్లీ ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. ఎన్ని నెలల తర్వాత వస్తుందో తెలుసా?

Bigg Boss: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం