Niharika
ఎంటర్‌టైన్మెంట్

Niharika Konidela : భ‌ర్తతో విడిపోవ‌డంపై నిహారిక‌ కామెంట్స్ వైరల్

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసందే. 2020 డిసెంబర్‌ 9న వివాహం చేసుకున్న ఈ జంట సడెన్ విడాకులు ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రెండేళ్లకే వీరి పెళ్లి బంధానికి పులిస్టాప్ పెట్టారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాతగా, నటిగా రాణిస్తూ నిహారిక బిజీ బిజీ అయిపోయింది. ఇక నిహారిక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటుంది. తన ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తన భర్తతో విడాకుల గురించి నిహారిక మాట్లాడిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

ఇక మెగా వారసురాలిగా నిహారిక టాలీవుడ్‌కి పరిచయమైంది. మొదట్లో యాంకర్‌గా, హోస్ట్‌గా అదృష్టం టెస్ట్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచి, మ్యాడ్‌ హౌస్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, డెడ్‌ పిక్సెల్స్‌ వంటి చిత్రాలు, సిరీస్‌లకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలు నిర్మిస్తూ వస్తుంది. బ్యానర్ పై వచ్చిన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ అయ్యింది. అలాగే తమిళ మూవీస్‌లో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుంది. సెలబ్రిటీ అయినా ఇంకా ఎవరైనా విడాకులు ఏ అమ్మాయికైన బాధాకరమైన అనుభవం అని పేర్కొంది. విడాకుల గురించి చిందిస్తూ.. ఎవరూ పెళ్లి బంధంలోకి వెళ్లరని తెలిపింది. ఎప్పుడు అందరి జీవితం ఒకేలా ఉండదని, జరుగుతున్న పరిణామాల దృష్ట్య మారుతూ ఉంటాయని పేర్కొంది. కొన్నిసార్లు పరిణామాలు డిఫరెంట్ గా ఉంటాయని, మరికొన్ని సార్లు అదుపు తప్పుతాయని తెలిపింది. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. జీవితంలో అనేక సవాళ్లు ఎదురుకుంటామని, వాటి నుంచి అనేక చాలా నేర్చుకుంటూ ఉంటామని తెలిపింది. అయితే నిహారిక సడెన్ గా ఇలా మార్పు ఎందుకు వచ్చిందో అని ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: ఆ హీరోయిన్‌ని చూసే అది నేర్చుకున్నా: అనన్యా పాండే

ఇక 2020 డిసెంబర్‌ 9న వివాహం చేసుకున్న ఈ జంట రెండేళ్లకే విడిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్నాళ్లు వేర్వేరుగా ఉంటూ అప్పుడే చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోస్ డిలీట్ చేశాడు. దీంతో అప్పటినుంచి వీరి బ్రేకప్‌ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత నిహారిక కూడా చైతన్య ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. ఇక మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లకు నిహారిక సింగిల్‌గా రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ తరువాత నిహారిక, చైతన్య దంపతులు అధికారికంగా ప్రకటించారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం