Ananya Panday: వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన యాక్టర్స్ ఎందరో ఉన్నారు. మొదటి సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నటులు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అనన్యా పాండే ఒకరు. బాలీవుడ్ ప్రముఖ నటుడు చంకీ పాండే కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ‘పతి పత్నీ ఔర్ వో’, ‘ఖాలీ పీలీ’ అనే మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఇవి కూడా ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాయి. ఇక ‘లైగర్’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ సుందరీ. విజయ్ దేవరకొండ జంటగా అనన్యా పాండే నటించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా ‘లైగర్’ నిలిచింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్ డిజాస్టర్ చిత్రంగా నిలించింది. ఈ సినిమాతో నిర్మాతలు భారీగా నష్టం చవిచూశారు. ఇక ఆ తర్వాత అనన్యా పాండే పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన గుర్తింపు రాలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్యా పాండే ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. వారసత్వంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తనకు మొదట్లో పలు సవాళ్లు తప్పలేదని అన్నారు. కెరీర్ ప్రారంభంలో మూవీ సెట్స్‌లో ఏది చెబితే అది చేసేదానిని అని పేర్కొంది. మన అవసరాలు, సమస్యల గురించి నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పే దాన్ని కాదని, ఆ విషయం కూడా తనకు తెలియదని వివరించింది. అలా ఉంటేనే తమకంటూ అండగా నిలబడే పర్సన్స్ ఉన్నారన్న విషయం.. ‘గెహ్రియాన్’ మూవీ సెట్‌లోనే అర్థమైందని తెలిపింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా దీపికా పదుకొణె యాక్ట్ చేసిందని, ఆమె సెట్‌లో వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని చెప్పింది. సెట్‌ల్లో ప్రతి ఒక్కరికీ అండగా ఉండేదని, అందరిని ప్రేమగా పలకరించేదని తెలిపింది. అంతేకాదు మర్యాదపూర్వకంగా మాట్లాడేదని పేర్కొంది. అంత పెద్ద స్టార్ డమ్ ఉన్న దీపికా.. కొంచం కూడా గర్వం కనిపించలేదని పేర్కొంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సత్యం ఆమె నుంచే నేర్చుకున్నానని తెలిపింది. ఇక అప్పటి నుంచి తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ ఫ్యూచర్‌లో మరిన్ని సినిమాలు తీసి సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.
Aslo Read: సూసైడ్ అటెంప్ట్‌పై స్పందించిన కల్పన