kalpana suicide attempt: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కల్పన చికిత్స పొందుతోంది. అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్‌పై పలు రకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూసైడ్ అటెంప్ట్‌పై కల్పన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కల్పన ఓ వీడియో రిలీజ్ చేసింది. శుక్రవారం ఉదయం కల్పన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులిటెన్ డాక్టర్లు విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మరోవైపు కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం వెనుక భర్త ప్రసాద్, కూతురు మాటవినకవడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కల్పన నుంచి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని, పెద్దకూతురిని చదవుల కోసం హైదరాబాద్ రావాలని కల్పన కోరితే, తాను కేరళలోనే చదువుకుంటానని తల్లితో కూతురు చెప్పడంతో మనస్తాపంతో నిద్ర మాత్రలు వేసుకుందని పోలీసులకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కల్పన కుమార్తె దయ స్పందించిన విషయం తెలిసిందే. తన తల్లిది ఆత్మహత్యాయత్నం కాదని తెలిపింది. తను గాయని మాత్రమే కాదని, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారని వెల్లడించింది. ఇటీవల ఇన్‌సోమ్నియాతో ఇబ్బంది పడినట్టు పేర్కొంది. దీంతో డాక్టర్ల సూచన మేరకే టాబ్లెట్స్ వాడుతుందని, ఈ క్రమంలోనే టాబ్లెట్స్ డోస్ ఎక్కువ కావడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు స్పష్టం చేసింది. తన తల్లి ఆత్మహత్యాయత్నం ఏమి చేయలేదని పేర్కొంది. తమ కుటుంబం అంత హ్యాపీగా ఉందని, తమ పేరేంట్స్ కూడా ఎలాంటి విబేధాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కూడా సూచించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆత్మహత్యాయత్నంపై కల్పన మాట్లాడారు. తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇన్‌సోమ్నియాతో ఇబ్బంది పడుతున్న తాను టాబ్లెట్స్ వాడుతున్నానని చెప్పింది. ఈ క్రమంలోనే డోస్ ఎక్కువ కావడం వల్ల స్పృహ తప్పి పడిపోయానని తెలిపింది. తమకు కుటుంబ గొడవలు ఏమి లేదని క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పడు లా కోర్సు చదువుతున్నానని వెల్లడించింది. తన భర్త ప్రోత్సహిస్తాడని, హ్యాపీగా ఉంటున్నామని పేర్కొంది. ఇటీవలే మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశామని వెల్లడించింది. అయితే ఇలా తప్పుడు ప్రచారం చేయడం బాధ కలిగించిందని పేర్కొంది. త్వరలో మంచి మంచి పాటలు పాడుతూ అందరిని సంతోష పెడతానని చెప్పుకొచ్చింది.
సింగర్ కల్పన సంచలన వీడియో..
స్ట్రెస్ వల్లే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను
నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు
నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త , కూతురు
నా మీద జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు
రైట్ టైంలో ఆయన పోలీసులను అలర్ట్ చేశారు కాబట్టే నేను… pic.twitter.com/IWdAlTgdZb
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2025
ఇక కల్పన సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడి అందరిని మైమరపించింది. మెలోడి పాటలతోపాటు అనేకమైన సాంగ్స్ పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి ఎన్నో పాటలు ఆలపించారు. బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొని అలరించారు.