Bayya Sunny Yadav: భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ఐఏ అరెస్ట్ చేశాక ఈ కుర్రాడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోయాడు. నా అన్వేషణ అన్వేష్ , సన్నీ యాదవ్ గురించి పోస్టులు పెడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశారో.. సన్నీ యాదవ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదేంటి ఎన్ఐఏ అరెస్ట్ చేసేశారు? ఆయన తీవ్రవాది? పక్క దేశం వాళ్ళు చాలా సీక్రెట్స్ చెప్పారు? భారత దేశానికి వ్యతిరేకంగా ఏవేవో చేసేశాడు? టెర్రరిస్ట్ అయితే జైల్లో పెట్టాలి కదా అని అనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు తెలుసుకుందాం..
Also Read: Air India Flights Cut: విమానాల్లో వరుస సమస్యలు.. ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. సారీ అంటూ!
సపోర్ట్ చేసే వాళ్ళ మాటలు ఇలా ఉన్నాయి?
ప్రజలు అన్వేష్ చెప్పిన మాటలన్ని నమ్మి అతన్ని తప్పు బట్టారు. అయితే, కొందరు భయ్యా సన్నీ యాదవ్ ని సపోర్ట్ చేస్తున్నారు. అతను దేశాన్ని ప్రాణంలా ప్రేమించాడు.అందుకే తన బైకు మీద త్రివర్ణపతాకాన్ని గర్వంగా రెపరెపలాడిస్తూ తిరుగుతాడు. అన్వేష్ లాంటి స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా, సన్నీ యాదవ్ లాంటి వ్యక్తిని ఏమీ చేయలేరని చెబుతున్నారు. NIA అరెస్ట్ చేశామని కూడా చెప్పలేదు. ప్రశ్నలు అడగడానికి తీసుకొని వెళ్లి వుండొచ్చు. అది కూడా ప్రూఫ్ లేదు. కానీ, ప్రతి రోజూ రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఏమీ తేలాకుండా దేశ ద్రోహి అని ఎలా ముద్ర వేస్తారు? అంటూ కొందరు మండి పడుతున్నారు.
విమర్శించే వాళ్ళ మాటలు ఇలా ఉన్నాయి?
Nia ఏదో అలా వదిలిపెట్టింది, కానీ బెట్టింగ్ చేస్తూ అమాయకపు ప్రజలను, యూత్ ని జీవీతాలను నాశనం చేశారు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అని పోలీసులు కూడా చెబుతున్నారు. కొద్దీ రోజులు ఆగితే తెలుస్తుందని అంటున్నారు. ఇంకొందరు నీ ప్రయాణాలు నీ ఇష్టం. నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావ్ అని చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. అది పూర్తి నీ పర్సనల్ .ఒకవేళ నువ్వు దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉంటే దేశంలో ఉండే ఇంటిలిజెన్స్ వ్యవస్థలు ఊరుకోవు అవి తొందరగానే కనిపెడతాయని కామెంట్స్ చేస్తున్నారు.