Shanmukha
ఎంటర్‌టైన్మెంట్

Shanmukha: ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Shanmukha Trailer: ఆది సాయికుమార్‌కు అర్జెంట్‌గా ఒక పెద్ద హిట్ కావాలి. తన ప్రయత్న లోపం లేకపోయినా, ఆయన చేసే సినిమాలేవీ ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ చిత్రాలుగా నిలబడటం లేదు. కంటెంట్, కాన్సెఫ్ట్ విషయాలలో చాలా డిఫరెంట్‌గా థింక్ చేస్తూ సినిమాలు చేస్తున్నా, ఆయనకి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. అందుకే ఈసారి ఆయన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఆది సాయికుమార్ (Aadi Saikumar) హీరోగా, అవికాగోర్ (Avika Gor) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. ష‌ణ్ముగం సాప్ప‌ని దర్శకత్వంలో సాప్‌బ్రో ప్రొడక్షన్స్ పతాకంపై సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, రమేష్‌ యాదవ్ నిర్మిస్తున్నారు. మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే..

Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!

‘సురులైనా, అసురులైనా.. చేసిన తప్పులకు శిక్షను అనుభవించకుండా తప్పించుకోలేరు. పూర్వం ఒక సురుడు తప్పు చేసి అసురుడయ్యాడు. శాప విమోచనం కోసం తపించసాగాడు. అయితే, ఇది అతని కథ కాదు. ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ..’ అంటూ ఒక పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌‌లో డైలాగ్ వినిపిస్తుంటే, తెరపై కనిపించే విజువల్స్ గూజ్‌బంప్స్‌ని తెప్పిస్తున్నాయి. ఆ వెంటనే నార్మల్ మోడ్‌లోకి తీసుకొచ్చి, ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

‘మిస్టరీ అనేది ఆల్వేస్ హిడెన్ పొజిషన్‌లోనే ఉంటుంది. పైకి నార్మల్‌గానే కనిపిస్తుంది’ అనే డైలాగ్, ‘అమ్మాయిలు కనిపించకుండా పోవడం, లెస్‌దెన్ వన్ మంత్ లోపే ప్రేమించిన అబ్బాయిల సూసైడ్స్ అవుతున్నాయ్. వై..’ అని హీరోయిన్ క్వశ్చన్ చేయడం కథలోని డెప్త్‌ని తెలియజేస్తుంది. ‘మై కంక్లూజన్ ఈజ్.. ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. వాళ్ల సూసైడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్‌లో.. డిఫరెంట్ మంత్ అండ్ ఇయర్స్‌లో జరిగాయి’ అంటూ హీరోయిన్ స్టోరీలైన్‌ని రివీల్ చేస్తే, హీరో యాక్షన్‌తో రంగంలోకి దిగడం సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ట్రైలర్ నడిచేకొద్ది సినిమాపై ఇంట్రెస్ట్‌ని కలిగించే సన్నివేశాలను లోడ్ చేసి, వెంటనే సినిమాను చూసేయాలనేంత క్యూరియాసిటీని కలిగించారు. ఓవరాల్‌గా అయితే, ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. అవికాగోర్ చాలా కొత్తగా కనిపిస్తుంటే, ఎప్పటిలానే ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా విజృంభించేశారు. ఇక ఈ ట్రైలర్‌‌లో రవి బస్రూర్ ఇచ్చిన నేపథ్య సంగీతం, ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తోంది. ఒక వండర్‌ఫుల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే ఫీల్‌ని అయితే ఈ ట్రైలర్ ఇస్తోంది. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో తెలియాలంటే మాత్రం మార్చి 21 వరకు వెయిట్ చేయక తప్పదు.

ఇవి కూడా చదవండి:
Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు